కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను కంపెనీ ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. కాగా.. ఈ కొత్త థార్‌కు సంబంధించిన ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్ అయ్యాయి.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

తాజాగా టీఎమ్‌బిహెచ్‌పి నుండి లీక్ అయిన సమాచారం ప్రకారం, కొత్త తరం థార్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. పాత బిఎస్4 వెర్షన్‌లో ఉపయోగించిన అదే డీజిల్ ఇంజన్‌ను కొత్తగా బిఎస్‌6కి అప్‌గ్రేడ్ చేసి ఇందులో ఉపయోగించనున్నారు.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

డీజిల్ వెర్షన్‌లో 2.2-లీటర్, బిఎస్6 కంప్లైంట్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ సుమారుగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

ఇకపోతే పెట్రోల్ వెర్షన్‌లో కొత్త 2.0-లీటర్ 'టిజిడి ఎమ్‌స్టాలియన్' టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

ఈ రెండు ఇంజన్లు తక్కువ-నిష్పత్తి గల గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటాయి. ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా ఇందులో ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

ఇదివరకటి తరం మహీంద్రా థార్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మహీంద్రా థార్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కారును కొత్త జెన్3 ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్ లైనప్‌లో టియువి300 ప్లస్ మరియు స్కార్పియో మోడళ్లను తయారు చేస్తున్నారు.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

ఇది మునపటి కన్నా కాస్తంత పెద్దగా ఉండే అవకాశం. ఫలితంగా ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ కూడా పెరగవచ్చని తెలుస్తోంది. శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ హ్యాండిల్ చేసేందుకు వీలుగా దీని ఛాస్సిస్‌ను కూడా రీఇన్‌ఫోర్స్ చేశారు. కొత్త థార్ హార్డ్ టాప్, సాఫ్ట్ టాప్ వెర్షన్లతో అందుబాటులోకి రానుంది.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

కొత్త తరం థార్‌లో పెద్ద వెర్టికల్-స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన కొత్త బంపర్‌లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఇది ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌తో లభ్యం కానుంది. మెరుగైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ఇందులో ఆల్-టెర్రైన్ టైర్లతో కొత్త ఫైవ్-స్పోక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

ఇదివరకు లీక్ అయిన స్పై చిత్రాలలో 2020 థార్‌లో హిల్ డీసెంట్ కంట్రోల్ (హెచ్‌డిసి) ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్) వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. వీటికి సంబంధించిన బటన్లను మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌కు కుడి వైపున అమర్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

కొత్త థార్‌లో జోడించిన ఇతర ఫీచర్లలో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లో ఉంచిన ఫోల్డబిల్ కీ ఫాబ్ మరియు పవర్-విండో స్విచ్‌లు, డిజిటల్ డిస్‌ప్లేతో రెండు అనలాగ్ డయల్‌లతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు ఉన్నాయి. ఇంకా ఇందులో క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు కార్బన్-ఫైబర్‌తో తయారు చేసిన గుండ్రటి ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, దాని చుట్టూ ఫినిషింగ్ వంటి వివరాలను ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఇంజన్, గేర్‌బాక్స్ వివరాలు లీక్

కొత్త 2020 మహీంద్రా థార్ గేర్‌బాక్స్, ఇంజన్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా తమ కొత్త తరం థార్‌తో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆఫ్-రోడ్ ప్రియులనే కాకుండా, రోజూవారీ ఉపయోగం కోసం కూడా ఈ వాహనాన్ని వినియోగించుకునేలా డిజైన్ చేసింది. ఇందుకోసం కొత్త తరం థార్ క్యాబిన్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది. ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తే, ఇది మరింత మంది వినియోగదారులకు చేరువయ్యే అవకాశం ఉంది.

Source:TeamBHP

Most Read Articles

English summary
According to the latest reports from TeamBHP, the engine and transmission specs of the upcoming Thar has been leaked ahead of unveil. Mahindra is expected to offer the new-generation Thar with both diesel and petrol engine options. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X