2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500'లో వచ్చే ఏడాది ఓ కొత్త తరం మోడల్ మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే, కంపెనీ ఈ కొత్త తరం మోడల్‌ను కర్ణాటక రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఈ కారుకు సంబంధించిన మరిన్ని కొత్త వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి సంబంధించిన ఇంటీరియర్స్ వివరాలు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త స్పై చిత్రాలు లీక్ అయ్యాయి. ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 లోపల మరియు బయట అనేక కొత్త ఫీచర్లు మరియు డిజైన్ అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉండనుంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన స్పై చిత్రాల ప్రకారం, రాబోయే 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లేతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుత తరం మహీంద్రా ఎక్స్‌యూవూ500 ఎస్‌యూవీలో లభించే సెమీ డిజిటల్ యూనిట్‌ను రీప్లేస్ చేయనుంది.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మహీంద్రా థార్ : వివరాలు

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఈ స్పై చిత్రాలు కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పూర్తిగా బహిర్గతం చేయనప్పటికీ, పాక్షికంగా ఇందులోని వివరాలను గమనించవచ్చు. డ్రైవర్‌కు అదనపు సమాచారాన్ని అందించడం కోసం డిస్‌ప్లే స్క్రీన్‌కు ఇరువైపులా స్పీడోమీటర్ మరియు టాకోమీటర్‌ను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఊహించిన ఇతర ఇన్ఫర్మేషన్ రీడౌట్‌లలో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), సగటు మైలేజ్, ఇంజన్ టెంపరేచర్ మరియు వీలైతే బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్ వంటి వ్యవస్థలు ఉండే అవకాశం ఉంది.

MOST READ:KLX 300 డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ ఆవిష్కరించిన కవాసకి ; పూర్తి వివరాలు

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఇదివరకు విడుదలైన స్పై చిత్రాల ప్రకారం, కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లోని కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ బహిర్గతమైన సంగతి తెలిసినదే. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటుగా కొత్త అడ్డంగా పేర్చబడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సిస్టమ్ వివరాలు వెల్లడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ కార్లలో ఇలాంటి డిస్‌ప్లే సెటప్‌ను చూడవచ్చు.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఇంకా ఈ కొత్త తరం ఎక్స్‌యూవీ500లో స్టీరింగ్‌కి ఇరువైపులా మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంటుంది. ఈ కంట్రోల్స్ సాయంతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఫోన్ కాల్‌ను స్వీకరించడం మరియు ముగించడం వంటి టెలిఫోనిక్ కార్యకలాపాల కోసం ఇందులో డెడికేటెడ్ బటన్స్ కూడా ఉన్నాయి.

MOST READ:ఇండియన్ మార్కెట్లో ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ప్రీ-బుకింగ్స్ స్టార్ట్ : లాంచ్ ఎప్పుడంటే

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

సెంట్రల్ కన్సోల్‌కు గమనిస్తే, దీనిని పూర్తిగా రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో కొత్త టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా మనం చూడొచ్చు. ఇది ఇరువైపులా రెండు డయల్స్‌తో కూడిన ట్రెడిషనల్ సెటప్‌లా అనిపిస్తుంది. ప్రస్తుత తరం మోడల్‌లోని బటన్ క్లస్టర్డ్ కన్సోల్ డిజైన్ ఈ కొత్త మోడల్ నుండి తొలగించారు.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

కాగా, ఓవరాల్‌గా కొత్త 2021 ఎక్స్‌యూవీ500 ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రం చిరుత నుండి ప్రేరణ పొందిన మొదటి తరం మోడల్ డిజైన్ సిల్హౌట్ మాదిరిగానే ఉంటుంది. కొత్త మోడల్ ఎస్‌యూవీ బోనెట్, బంపర్, గ్రిల్, ల్యాంప్ సెటప్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిల్లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది.

MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎక్స్‌యూవీ500లో కొత్త 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

అంతేకాకుండా, మహీంద్రా తమ కొత్త 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బహుశా ఇది 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ కావచ్చు, ఇదే ఇంజన్‌ను కొత్త తరం 2020 మహీంద్రా థార్‌లో కూడా ఉపయోగిస్తు్ననారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి వవర్‌ను మరియు 320 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు; కొత్త వివరాలు

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో క్యాబిన్ లోపల మరియు వెలుపల కొత్త లేఅవుట్ మరియు డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా గ్రావిటాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source:TeamBHP

Most Read Articles

English summary
2021 Mahindra XUV500 Digital Instrument Cluster Display Revealed, New Spy Pics and Other Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X