కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త తరం కార్నివాల్ ఎమ్‌పివి టీజర్ డిజైన్‌ను, ఆ తర్వాత ఎక్స్‌టీరియర్ చిత్రాలను వెల్లడించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ కొత్త కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌ని కూడా వెల్లడి చేసింది. ముందుగా గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న కొత్త 2021 కియా కార్నివాల్, ఆ తర్వాత భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కియా ఆవిష్కరించిన కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌ని గమనిస్తే, ఇది ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ కన్నా మరింత మెరుగ్గా కనిపిస్తోంది. విశాలమైన క్యాబిన్, సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్‌, మెరుగైన కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లతో దీనిని తయారు చేశారు. ఫుల్లీ ఫీచర్ ప్యాక్డ్‌గా రానున్న ఈ కొత్త కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్స్ మునుపటి వెర్షన్ల కన్నా మరింత ప్రీమియంగా ఉంటాయి.

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొత్త కియా కార్నివాల్ డాష్‌బోర్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న అనేక ప్రీమియం కార్ మోడళ్ల నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఇందులో అమర్చిన బ్రాండ్-న్యూ ట్విన్-స్క్రీన్ సెటప్ కొత్త కియా కార్నివాల్ ఇంటీరియర్‌లలో ప్రధాన మార్పుగా చెప్పుకోవచ్చు.

MOST READ:భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో బ్రాండ్ యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటు అనేక ఇతర ఫీచర్లను జోడించనున్నారు. ఇందులో ప్రధానంగా హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. కొత్త కార్నివాల్ డాష్‌బోర్డ్‌లో సొగసైన ఎసి వెంట్స్ ఉంటాయి, ఇవి ఆడి క్యూ7 ఎస్‌యూవీ మాదిరిగా డ్యాష్‌బోర్డ్ పొడవునా ఉంటాయి.

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొత్త 2021 కియా కార్నివాల్‌లో అందించబోయే ఇతర ఫీచర్లలో ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, వెనుక ప్రయాణీకుల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే, అనేక ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

MOST READ:భర్తతో గొడవ.. నడిరోడ్డులో రేంజ్ రోవర్ కారుపైకెక్కిన భార్య, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొత్త తరం కియా కార్నివాల్ కూడా, దాని ప్రస్తుత తరం మోడల్ మాదిరిగానే విభిన్నమైన సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభ్యం కానుంది. ఇందులో 7, 8, 9 మరియు 11 సీట్ల కాన్ఫిగరేషన్లలో ఇది లభ్యమయ్యే అవకాశం ఉంది. కొత్త కియా కార్నివాల్‌లో పెద్ద సన్‌రూఫ్‌తో పాటుగా పెద్ద విండోస్‌తో మరింత ఓపెన్ క్యాబిన్‌ను కలిగి ఉండనుంది.

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొలతల పరంగా చూసుకుంటే, కొత్త 2021 కియా కార్నివాల్‌ను మరింత పెద్దదిగా డిజైన్ చేశారు. ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎమ్‌పివి 40 మిమీ ఎక్కువ పొడవును మరియు 10 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉంటుంది, అదే సమయంలో దీని వీల్‌బేస్‌ను కూడా 30 మిమీ పెంచారు.

MOST READ:ఈ సొరంగ మార్గ నిర్మాణం జరిగితే 50 కి.మీ దూరం తగ్గుతుంది, అదెక్కడుందో తెలుసా ?

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

ఇంటీరియర్స్‌లోనే కాకుండా, కొత్త 2021 కియా కార్నివాల్ ఎక్స్‌టీరియర్‌లలో కూడా మార్పులు చేశారు. ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి లైట్ బార్ ద్వారా అనుసంధానించబడిన ఎల్‌ఈడి టెయిల్‌లైట్స్, పూర్తిగా ఫ్రెష్ డిజైన్‌తో తయారు చేసిన అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. - కియా కార్నివాల్ ఎక్స్‌టీరియర్ ఫీచర్ల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి. https://telugu.drivespark.com/four-wheelers/2020/new-kia-carnival-revealed-first-official-images-released-details-014450.html

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంజన్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో లభ్యమయ్యే అవకాశం ఉంది. కాకపోతే, వీటిలో ప్రస్తుతం ఉన్న ఇంజన్లనే ఉపయోగిస్తారా లేక కొత్త టర్బో ఇంజన్లను ఆఫర్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని కొత్త మోడిఫైడ్ డీజిల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

కొత్త తరం కియా కార్నివాల్ ఇంటీరియర్స్ వెల్లడి - వచ్చే ఏడాది ఇండియా లాంచ్

కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ ప్రస్తుత తరం కార్నివాల్ ఎమ్‌పివిని భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు కాబట్టి ఈ కొత్త తరం 2020 కియా కార్నివాల్ ఇప్పట్లో భారత్‌లో విడుదలవుతుందున్న సూచనలు లేవు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది మన మార్కెట్లో లభించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
new generation kia carnival interiors revealed india launch details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X