ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో హోండా ఒకటి. హోండా బ్రాండ్ నుంచి విడుదలైన వాహనాలు ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు హోండా కంపెనీ 2020 హోండా సిటీ మోడల్ ని ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

జపాన్ కార్ల తయారీదారు అయిన హోండా వచ్చే నెలలో భారతదేశంలో 2020 హోండా సిటీని ప్రారంభించడానికి సన్నాహాలను చేస్తుంది. ఇప్పటికే ఇండియన్ రోడ్లపై టెస్ట్ డ్రైవ్ లను కూడా నిర్వహించింది. సాధారణంగా హోండా 2019 ఆటో ఎక్స్‌పో థాయ్‌లాండ్‌లో ప్రారంభించింది.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఐదవ తరం హోండా సిటీ మునుపటి మోడల్ కంటే 113 మిమీ పొడవు మరియు 53 మిమీ వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ వాహనంలో వీల్ బేస్ తక్కువగా ఉంటుంది. అవుట్గోయింగ్ మోడల్ కంటే 28 మిమీ తక్కువగా ఉంటుంది.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

కొత్త 2020 హోండా సిటీ లో అన్ని ఎల్‌ఇడి హెడ్‌లైట్లు మరియు టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి అనుకూలమైన ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరాలు, డిజిటల్ మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లే సిస్టమ్ మరియు రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ వంటివి ఉంటాయి.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

కొత్త హోండా సిటీలో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోలర్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్స్, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టం మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఉంటాయి.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

భారతదేశంలో త్వరలో విడుదల కానున్న హోండా సిటీ రెండు బిఎస్-6 కంప్లైంట్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఒకటి 1.5 డీజిల్ ఇంజిన్. రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

హోండా సిటీలోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 117 బిహెచ్‌పి పవర్ మరియు 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటాయి. 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్న హోండా సిటీ ఆర్ఎస్ టర్బో మోడల్‌ను కూడా హోండా విడుదల చేయగలదు. ఇది 122 బిహెచ్‌పి శక్తిని మరియు 173 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

ప్రస్తుత తరం హోండా సిటీ మోడల్స్ ధరలు గమనించినట్లయితే రూ. 9.91 లక్షల నుంచి రూ. 14.31 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. కొత్తగా వస్తున్న హోండా సిటీ దాదాపు రూ. 11 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు.

ఇండియాలో ప్రారంభం కానున్న బిఎస్ 6 హోండా సిటీ.. ఎప్పుడంటే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా సిటీ కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్. ఇందులో అధునాతన లక్షణాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి. హోండా సిటీ ఒక్కసారి ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన తరువాత మారుతి సుజుకి సియాజ్, టయోటా యారిస్, వోక్స్వ్యాగన్ వెంటో, 2020 స్కోడా రాపిడ్ మరియు త్వరలో ప్రారంభించబోయే హ్యుందాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda City 2020 Model To Launch In India Next Month: Details, Features, And Expected Price. Read in Telugu.
Story first published: Wednesday, February 12, 2020, 10:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X