డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుండి భారత్‌లో విడుదల కానున్న మరొ కొత్త ఉత్పత్తి '2020 బిఎస్6 హోండా జాజ్' ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. భారత్‌లో కఠినతరం చేసిన బిఎస్6 నిబంధనల కారణంగా మార్కెట్ నుంచి అదృశ్యమైన హోండా జాజ్, ఇప్పుడు కొత్త బిఎస్6 ఇంజన్‌తో మార్కెట్లోకి రానుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే హోండా డీలర్లు కొత్త జాజ్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు కస్టమర్లకు ప్రదర్శించేందుకు గాను కొత్త జాజ్ కారు ఇప్పటికే డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఓ వీడియో ప్రకారం, డీలర్‌షిప్‌కు చేరుకున్న డెమో వెర్షన్ 2020 హోండా జాజ్ కారును ఇక్కడ చూడొచ్చు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్ కేంద్రాలలో రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి కస్టమర్లు 2020 బిఎస్6 జాజ్ కారును బుక్ చేసుకోవచ్చు. అలా కాకుండా, కస్టమర్లు ఇంటి వద్ద నుంచే హోండా కార్స్ ఇండియా అధీకృత వెబ్‌సైట్‌ను సందర్శించి 'హోండా ఫ్రమ్ హోమ్' ప్లాటఫామ్ ద్వారా రూ.5,000 నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

ఈ వీడియోలో గుర్తించిన హోండా జాజ్ టెస్ట్ డ్రైవ్ కారు మాదిరిగా అనిపిస్తుంది. ఇది టాప్-ఎండ్ జెడ్ఎక్స్ వేరియంట్. ఇదివరకు కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2020 హోండా జాజ్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుందని, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండదని కంపెనీ ధృవీకరించింది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

కంపెనీ అమ్మకాల నివేదిక ప్రకారం, భారత మార్కెట్లో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో హోండా సగటున 80 శాతం పెట్రోల్ వాహనాలను విక్రయించగా, కేవలం 20 శాతం మాత్రమే డీజిల్ వాహనాలను విక్రయించింది. ఫలితంగా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.

MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

ఇందులోని పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కొత్తగా బిఎస్6కి అప్‌డేట్ చేసి ఉపయోగించనున్నారు. ఇందులోని బిఎస్4 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. బిఎస్6 మోడల్‌లో కూడా పవర్, టార్క్ గణాంకాలు ఒకే విధంగా ఉంటాయని అంచనా.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

కొత్త 2020 హోండా జాజ్ బిఎస్‌6 మోడల్‌లో కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా, డిజైన్ పరంగా కొన్ని కాస్మోటిక్ మార్పులు కూడా ఉన్నాయి. మునపటి తరం హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో మార్పులు చేర్పులు ఉన్నాయి.

MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

ఎక్స్‌టీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇందులో ప్రధానంగా క్రోమ్ యాక్సెంట్స్‌తో గార్నిష్ చేసిన గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్‌తో కూడిన హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ లాంప్స్ మరియు రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, అన్ని వైపులా ఎల్ఈడి లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మార్పులతో రానున్న 2020 హోండా జాజ్ బయటి వైపు నుంచి మరింత షార్ప్ లుక్‌తో కనిపించనుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

ఇక ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ మరియు సివిటి రెండింటిలోనూ పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. జాజ్ సివిటి మోడల్‌లో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌గా పాడిల్-షిఫ్టర్స్ జోడించారు. మునుపటి ఆర్థిక సంవత్సరంలో హ్యాచ్‌బ్యాక్ సివిటి మోడల్స్ 70 శాతం అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది.

MOST READ: కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

కొత్త 2020 జాజ్‌లో చేయబోయే ఇతర మార్పుల విషయానికి వస్తే, ఇందులో టెంపరేచర్ కంట్రోల్ కోసం భౌతిక బటన్ నియంత్రణ యూనిట్ ఉంటుంది, ఇది పాత మోడల్‌లో కనిపించే టచ్‌ప్యాడ్ వ్యవస్థను రీప్లేస్ చేస్తుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

మార్కెట్లో విడుదలైన తర్వాత కొత్త హోండా జాజ్ ఈ విభాగంలో టాటా ఆల్ట్రోజ్, మారుతి సుజుకి బాలెనో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా గ్లాంజా మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కొత్త 2020 జాజ్, బిఎస్4 మోడల్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా. గతంలో హోండా జాజ్ బిఎస్4 మోడళ్లను రూ.7.45 లక్షల నుంచి రూ.9.40 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లో విక్రయించేవారు.

MOST READ: ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు కానున్న సిఈఓ : ఎవరో తెలుసా

డీలర్ల వద్దకు చేరుకుంటున్న 2020 హోండా జాజ్ బిఎస్6; త్వరలోనే విడుదల

హోండా జాజ్ బిఎస్6 ప్రీమియం హ్యాచ్‍బ్యాక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త హోండా జాజ్ వాస్తవానికి గత నెలలోనే మార్కెట్లోకి విడుదల కావల్సి ఉండగా, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19, లాక్‌డౌన్ వంటి పలుకు కారణాల వలన ఆలస్యమైంది. కొత్త 2020 జాజ్ మార్కెట్లో విడుదలైతే, ఇది హోండాకు దేశంలో 6వ బిఎస్6 మోడల్‌గా మారనుంది. హోండా ఇప్పటికే, తమ కొత్త తరం బిఎస్6 హోండా సిటీ కారును మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

Source:YouTube

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda will soon launch the 2020 Jazz in the Indian market. It is expected to go on sale in the coming weeks. Ahead of its launch, the company has started to accept pre-booking for the premium hatchback for a token amount of Rs 21,000, if booked at dealerships. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X