సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

హోండా కార్స్ ఇండియా తమ సరికొత్త 2020 డబ్ల్యూఆర్-వి (WR-V) ఎస్‌యూవీని ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అప్‌డేటెడె బిఎస్6 ఇంజన్‌తో పాటుగా సరికొత్త డిజైన్‌తో తయారైన 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ ఇప్పుడు సైలెంట్‌గా డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది.

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

దేశంలోని కొన్ని హోండా డీలర్‌షిప్ కేంద్రాలు ఇప్పటికే ఈ కొత్త హోండా డబ్ల్యూఆర్-వి కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు. హోండా కార్స్ ఇండియా అధీకృత వెబ్‌సైట్‌లో కూడా ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే ఈ కొత్త కారు మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

వాస్తవానికి ఇప్పటికే ఈ కారు మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. గడచిన మార్చ్ నెలలో గుప్పుమన్న కరోనా వైరస్, దాని నివారణ కోసం ప్రకటించిన లాక్‌డౌన్‌ల కారణంగా ఈ కారుల విడుదల జాప్యమైంది. అందరికన్నా ముందుగా ఈ కొత్త హోండా డబ్ల్యూఆర్-వి కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ: కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

హోండా ఇప్పటికే కొన్ని ప్రముఖ డీలర్‌షిప్ కేంద్రాలకు సరికొత్త 2020 డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ సైలెంట్‌గా పంపిస్తోంది. కస్టమర్లకు డెమో ఇవ్వటం కోసం, డిస్‌ప్లేలో ఉంచడం కోసం ఈ కారును ముందుగానే డీలర్ల వద్దకు చేరుస్తున్నారు.

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

కొత్త హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో డిజైన్ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ కారు ముందు భాగాన్ని పూర్తిగా రీడైన్ చేశారు. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ గ్రిల్ వంటి మార్పులను ముందు వైపు చూడొచ్చు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : పెట్రోల్ బంక్ లో కొత్త సిస్టం

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

ఇంకా ఇందులో కొత్తగా డిజైన్ చేసిన 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. వెనుక వైపు డిజైన్‌లో కూడా మార్పులు ఉన్నాయి. సరికొత్త ఎల్ఈడి టెయిల్ లైట్ డిజైన్ మరియు పెద్ద బంపర్, అలాగే బంపర్ క్రింది భాగంలో బ్లాక్ అండ్ క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను చూడొచ్చు. బ్యాక్ లైట్లను స్ప్లిట్ డిజైన్ (సగం డోరుపై, సగం బాడీపై) ఉండేలా తయారు చేశారు.

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

కొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఇంటీయర్లలో మాత్రం మార్పులు స్వల్పంగానే ఉన్నాయి. ఓవరాల్ క్యాబిన్ డిజైన్ ఇదివరకటి మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో కొత్త రకం అప్‌హోలెస్ట్రీని, సీట్ డిజైన్లను మనం గమనించవచ్చు.

MOST READ: ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

ఇంకా ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, రియర్ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, క్రూయిజ్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

హోండా డబ్ల్యూఆర్-వి భారత మార్కెట్లో ఎస్‌వి, విఎక్స్ అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులోని బిఎస్6 1.2 లీటర్ పెట్రోల్ అంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని మరియు బిఎస్6 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, డీజిల్ వెర్షన్ -స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

MOST READ: సరికొత్త 2020 మహీంద్రా థార్ విడుదల ఖరారు; వివరాలు

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బుకింగ్స్ ఓపెన్, త్వరలోనే విడుదల!

కొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-విపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు పోటీగా రానున్న కొత్త హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరను కలిగి ఉండొచ్చని అంచనా. ఈ మోడల్ బుకింగ్‌లను ప్రారంభించడాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Source:Zigwheels

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India revealed the 2020 WR-V SUV in the Indian market, earlier this year. The new Honda WR-V comes with a number of subtle cosmetic revisions while also featuring an updated BS6-compliant engine. Read in Telugu.
Story first published: Tuesday, June 16, 2020, 14:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X