కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

కొరియన్ కార్ బ్రాండ్ 'హ్యుందాయ్ మోటార్స్' ఇండియా భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఐ20' లో కంపెనీ ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇది వరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పటికే హ్యుందాయ్ తమ తదుపరి తరం ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం, ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 సెప్టెంబర్ 2020 నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

అయితే, ఇప్పుడు తాజాగా ఓవర్‌డ్రైవ్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ లాంచ్‌ను అక్టోబర్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మోడల్ లాంచ్ ఆలస్యం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, వీటిలో ప్రధానమైనది దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

గడచిన వారం చెన్నై మరియు ఇతర పొరుగు జిల్లాలైన కాంచీపురం, చెంగల్‌పట్టు మరియు తిరువల్లూరులలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ లాక్‌డౌన్ జూన్ 19-30, 2020 వరకూ అమలులో ఉంటుంది. ఈ లాక్‌డౌన్ ప్రభావం కాంచీపురంలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న హ్యుందాయ్ తయారీ ప్లాంట్‌పై కూడా పడనుంది.

MOST READ: చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో, తమ ప్లాంట్‌లో సిబ్బంది భద్రత దృష్ట్యా హ్యుందాయ్ అతి తక్కువ మ్యాన్ పవర్‌ను వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో, తక్కువ సిబ్బంది కారణంగా ఉత్పత్తి కూడా తగ్గనుంది. ఈ కారణాల దృష్ట్యా ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి, భారత్‌లో ఈ మోడల్ విడుదల కూడా జాప్యమయ్యే ఆస్కారం ఉంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

మరోవైపు హ్యుందాయ్‌కు అతి తక్కువ సమయంలో మంచి విజయాలను తెచ్చిపెట్టిన హ్యుందాయ్ క్రెటాలో కంపెనీ ఓ కొత్త 2020 వెర్షన్‌పై కూడా దృష్టి సారించింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఇప్పటికే 30,000 బుకింగ్‌లను నమోదు చేసింది. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న‘క్లిక్ టు బై' ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో క్రెటా ప్రముఖ మోడల్‌గా మారింది.

MOST READ: భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

ఇకపోతే హ్యుందాయ్ ఇటీవలే విడుదల చేసిన సరికొత్త వెర్నా ప్రీమియం సెడాన్ కూడా, మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అధిక సంఖ్యలో బుకింగ్‌లను నమోదు చేసుకొని మంచి డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను పూర్తి చేసేందుకు కంపెనీ ప్రయత్నించనుంది. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరగనుంది. ఇవి కూడా ఐ20 విడుదల ఆలస్యం కావటానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

ఇక సరికొత్త హ్యుందాయ్ ఐ20 విషయానికి వస్తే, ఇది సరికొత్త డిజైన్, కొత్త ఫీచర్లను కలిగి ఉండనుంది మరియు ఇందులో అనేక ఇంజన్ ఆప్షన్లు కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇందులో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్, మరింత అందంగా కనిపించే హెడ్‌ల్యాంప్స్. వ్రాప్-అరౌండ్ స్ప్లిట్ టెయిల్ లాంప్స్‌ మరియు వీటిని అనుసంధానించే లైట్ బార్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్-వీల్ డిజైన్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫీచర్లతో ఇది మునుపటి వెర్షన్ ఐ20 కన్నా మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

MOST READ: సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

ఇంటీరియర్లను గమనిస్తే, ఇందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 10.25-ఇంచ్ డిస్‌ప్లే యూనిట్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త ‘బ్లూలింక్' కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్-ఎస్‌యూవీలో 33 కమాండ్ ఫీచర్లను ఈ కొత్త తరం హ్యుందాయ్ ఐ20 కారులో కూడా ఉపయోగించనున్నారు.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త ఐ 20 మూడు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయి. తమ అనుబంధ సంస్థ కియా సెల్టోస్‌లో ఉపయోగిస్తున్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా ఇందులో ఉపయోగించనున్నారు.

MOST READ: న్యూస్ పేపర్ తో రైల్ నమూనా నిర్మించిన స్కూల్ స్టూడెంట్

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

కొత్త ఐ20 భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలైట్ ఐ20 మోడల్‌తో పోలిస్తే కొత్త ఐ20 జోడించిన ప్రీమియం ఫీచర్ల కారణంగా దీని ధరలు కూడా గణనీయంగా పెరగవచ్చని అంచనా.

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యం, కారణం ఏంటో తెలుసా?

కొత్త హ్యుందాయ్ ఐ20 విడుదలలో జాప్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా అనేక వ్యాపారాలు మరియు ఉత్పత్తి కార్యకలాపాలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రభావితం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అసరమైన ప్రాంతాల్లో తక్కువ కాలం మాత్రమే లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. తాజాగా చెన్నైలో ప్రకటించిన లాక్‌డౌన్ హ్యుందాయ్ ప్లాంట్ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది. కొత్త ఐ20 విషయానికొస్తే, ఇది కొరియన్ బ్రాండ్ నుంచి వస్తున్న ఫుల్లీ లోడెడ్ అండ్ ఫీచర్ ప్యాక్డ్ మోడల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Hyundai Motors India is gearing up to introduce the next-generation i20 in the Indian market. The company has already unveiled the premium hatchback ahead of its launch. It was expected to arrive in the Indian market in September 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X