ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త హ్యుందాయ్ ఐ 20 ఇప్పుడు మూడవ తరం పునరావృతంలో ఉంది. ఇది పూర్తిగా సరికొత్త స్టైలింగ్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా దాని సరికొత్త గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా ఉంది.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 ప్రారంభ ధర రూ. 6.79 లక్షలతో అందించబడుతుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా (ఓ) అనే నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. టాప్-స్పెక్ ట్రిమ్ ధర రూ. 11.17 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ).

Magna Sportz Asta Asta (O)
1.2L Kappa Petrol 5MT ₹6,79,900 ₹7,59,900 ₹8,69,900 ₹9,19,900
IVT ₹8,59,900 ₹9,69,900
1.0L Turbo GDi Petrol iMT ₹8,79,900 ₹9,89,900
7DCT ₹10,66,900 ₹11,17,900
1.5L U2 CRDi Diesel 6MT ₹8,19,900 ₹8,99,900 ₹10,59,900
ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్స్ వారం క్రితం ప్రారంభమైంది. కొత్త హ్యుందాయ్ ఐ 20 పై ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ కారును ఆన్‌లైన్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏ డీలర్‌షిప్‌ల ద్వారా అయినా 21,000 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు. కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోసం డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

MOST READ:20,000 యూనిట్ల బుకింగ్స్ దాటిన మహీంద్రా థార్.. మళ్ళీ పెరిగిన వెయిటింగ్ పీరియడ్ పీరియడ్

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ20 కారు యొక్క డిజైన్ గమనించినట్లైతే ఇది పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్ అప్ ఫ్రంట్ తో వస్తుంది. గ్రిల్‌లో గ్లోస్-బ్లాక్ మెష్ ఉంటుంది మరియు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు ఇరువైపులా ఉంటాయి. హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, కార్నరింగ్ లాంప్స్ మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్లతో కూడా వస్తాయి. ఫ్రంట్ బంపర్ కూడా కొత్తది మరియు ఇప్పుడు త్రిభుజాకార ఆకారంలో ఉన్న హౌసింగ్‌లో ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ కలిగి ఉంది.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

ఈ హ్యాచ్‌బ్యాక్ వెనుక ప్రొఫైల్ i20 యొక్క స్పోర్టి డిజైన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో పాటు విండోస్ మరియు డోర్ హ్యాండిల్స్ చుట్టూ క్రోమ్ యాక్సెస్ కలిగి ఉంటుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM లతో వస్తుంది.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

వెనుక భాగంలో కొత్త Z- ఆకారపు ఎల్‌ఈడీ టైల్ లైట్లు ఉంటాయి, ఇవి క్రోమ్ మరియు రిఫ్లెక్టర్ యొక్క సన్నని స్ట్రిప్‌తో అనుసంధానించబడి ఉంటాయి. వెనుక భాగంలో స్టాప్ లాంప్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రియర్ వైపర్ మరియు వాషర్ కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 లోపల మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, పుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. క్యాబిన్ చుట్టూ ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్, వైర్‌లెస్ ఛార్జింగ్, సీట్ల కోసం ప్రీమియం అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మూడు ఇంజన్ల ఎంపికతో పనిచేస్తుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ 83 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది, ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్ ఆటోమేటిక్‌తో జత చేయబడింది.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

రెండవది 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ ఇంజన్. ఇది 120 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్ప చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటి ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది. మూడవ ఇంజన్ 1.5-లీటర్ సిఆర్డి డీజిల్ యూనిట్. ఈ ఇంజిన్ 100 బిహెచ్‌పి మరియు 240 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడుతుంది.

MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ ఐ 20 ఎనిమిది కలర్ అప్సన్లలో అందించబడుతుంది. ఇందులో ఆరు మోనో-టోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ ఎంపికలు ఉన్నాయి. మోనో-టోన్ పెయింట్ స్కీమ్ విషయానికి వస్తే ఇందులో పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ & మెటాలిక్ కాపర్ కలర్స్ ఉన్నాయి. అదేవిధంగా, డ్యూయల్-టోన్ ఎంపికలలో పోలార్ వైట్ / బ్లాక్ & ఫైరీ రెడ్ / బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హ్యుందాయ్ ఐ 20 భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫర్‌లలో ఒకటి. అంతే కాకుండా ఇది భారతదేశంలో బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులలో ఒకటి. కొత్త హ్యుందాయ్ ఐ 20 భారత మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, వోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
All-New Hyundai i20 Premium Hatchback Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X