Just In
- 32 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 51 min ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- News
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త హ్యుందాయ్ ఐ20 మైలేజ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త 2020 ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తోంది. తాజాగా ఈ మోడల్‌కి సంబంధించిన మైలేజ్ గణాంకాలు విడుదలయ్యాయి.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నవంబర్ 5, 2020వ తేదీన కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కారు భారత మార్కెట్లో విడుదల కానుంది. తాజాగా కార్దేఖో లీక్ చేసిన సమాచారం ప్రకారం, కొత్త హ్యుందాయ్ ఐ20 ఇంజన్ ఆప్షన్స్ మరియు వాటి మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కారు రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

పెట్రోల్ ఇంజన్లలో 1.2-లీటర్ యూనిట్ 83 బిహెచ్పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 100 బిహెచ్పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

వీటి మైలేజ్ గణాంకాలను గమనిస్తే, 1.2-లీటర్ పెట్రోల్ ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆరు-స్పీడ్ సివిటి ఆప్షన్‌తో లభిస్తుంది. వీటి మైలేజ్ గణాంకాలు వరుసగా 21 కెఎంపిఎల్ మరియు 19.65 కెఎంపిఎల్గా ఉన్నాయి. అదేవిధంగా, ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి లేదా 6-స్పీడ్ ఐఎమ్‌టి ట్రాన్స్మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. వీటి మైలేజ్ గణంకాలు వరుసగా 20.28 కెఎంపిఎల్ మరియు 20 కెఎంపిఎల్గా ఉన్నాయి.

ఇకపోతే, కొత్త హ్యుందాయ్ ఐ20 డీజిల్ వెర్షన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. కొత్త హ్యుందాయ్ ఐ20 మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్.
MOST READ:మాస్క్ వాడకంపై BBMP కొత్త రూల్స్.. ఏంటో తెలుసా..?

సరికొత్త హ్యుందాయ్ ఐ20 ఆరు మోనో-టోన్ (సింగిల్ కలర్) మరియు రెండు డ్యూయల్-టోన్ (డబుల్ కలర్) పెయింట్ స్కీమ్స్‌లో లభిస్తుంది. మోనో-టోన్ కలర్ ఆప్షన్లలో పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ మరియు మెటాలిక్ కాపర్ ఉన్నాయి. అలాగే, డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్లలో ఫైరీ రెడ్ / బ్లాక్ రూఫ్ మరియు పోలార్ వైట్ / బ్లాక్ రూఫ్ ఉన్నాయి. అయితే, ఈ రెండు కలర్ ఆప్షన్లు మాత్రం టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.

కొత్త హ్యుందాయ్ ఐ20 కారును లోపల, బయట పూర్తిగా రీడిజైన్ చేశారు. ఈ కారు ముందు భాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డిఆర్ఎల్లు, జెడ్ ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?

ఇంటీరియర్స్‌లో కూడా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పూర్తిగా సరికొత్త డిజైన్‌తో కూడిన డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 కోసం అక్టోబర్ 28, 2020వ తేదీ నుండి అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు ఇప్పుడు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త తరం హ్యుందాయ్ ఐ20 భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 మైలేజ్ గణాంకాలపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
హ్యుందాయ్ ఈ గణాంకాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ, పైన పేర్కొన్న 2020 హ్యుందాయ్ ఐ20 మైలేజ్ గణాంకాలు మాత్రం చాలా ఆకర్షనీయంగా ఉన్నాయి. వీటిలో డీజిల్ ఇంజన్ అత్యధికంగా లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.