ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో కంపెనీ సరికొత్త తరం మోడల్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కారుకు సంబంధించిన అధికారిక చిత్రాలను మరియు వివరాలను వెల్లడి చేసింది. నవంబర్ నెలలో ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఇప్పటికే తమ కొత్త 2020 ఐ20 కారును తమ డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది. కొన్ని డీలర్‌షిప్ కేంద్రాలలో అయితే, ఈ మోడల్ కోసం ఇప్పటికే అనధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ పరంగా పూర్తిగా రీడిజైన్ చేశారు.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కొత్త తరం ఐ20 అందుబాటులోకి రానుంది. అయితే, ఓవరాల్ ఐ20 సిల్హౌట్ మాత్రం యధావిధిగా ఉండనుంది. హ్యుందాయ్ ఇండియా తొలిసారిగా ఇండియా-స్పెక్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన అధికారిక టీజర్ చిత్రాలను విడుదల చేసింది.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

ఈ అధికారిక డిజైన్ స్కెచ్‌లను చూసినట్లయితే, కొత్త హ్యుందాయ్ ఐ20 బ్రాండ్ యొక్క 'సెన్సియస్ స్పోర్టినెస్' గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరించి తయారు చేసినట్లుగా అనిపిస్తుంది.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

ఈ కారు ముందు భాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్లు, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ మరియు ఇతర స్టైలిష్ మరియు స్పోర్టి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

ఇదే తరహాలో స్పోర్టీ డిజైన్ అంశాలు హ్యాచ్‌బ్యాక్‌లోని ఇంటీరియర్స్‌లో కూడా కొనసాగుతాయి. ఇందులో పూర్తిగా సరికొత్త డిజైన్‌తో కూడిన డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ కనిపిస్తుంది. కొత్త తరం హ్యుందాయ్ ఐ20 క్యాబిన్, ఇంటర్నేషనల్ మోడల్స్‌లో కనిపించేలానే ఉంటుంది.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

MOST READ:తాత కోసం బాలుడు చేసిన అద్భుత సృష్టి.. నిజంగా ఇది సూపర్ వెహికల్.. అదేంటో చూసారా ?

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

అంతేకాకుండా, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, యాక్టివ్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్‌వ్యూ కెమెరా, ఈబిడితో కూడిన ఏబిఎస్, బహుళ ఎయిర్‌బ్యాగులు మరియు ఇతర పరికరాలు కూడా ఉన్నాయి.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగానే గానే కొత్త ఐ20 కూడా విభిన్న రకాల ఇంజన్ ఆప్షన్స్‌తో లభ్యం కానుంది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇందులో మొదటది 1.2-లీటర్ ఎన్‌ఏ ఇంజన్, ఇది 83 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

MOST READ:స్కోడా కంపెనీకి భారీ జరిమానా విధించిన వినియోగదారుల కోర్టు.. ఎందుకో తెలుసా?

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

ఇకపోతే రెండవది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ ఐఎమ్‌టి మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం కానుంది.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

డీజిల్ ఇంజన్ విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ ఐ20లో ఇదివరకటి 1.5-లీటర్ ఇంజన్‌నే ఆఫర్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో లభిస్తుంది.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 మార్కెట్‌లో విడుదలైన తర్వాత ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.6.5 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఇండియా)గా ఉండొచ్చని అంచనా.

ఇదే సరికొత్త హ్యుందాయ్ ఐ20; లుక్ అండ్ ఫీచర్స్ అదుర్స్..

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 అధికారిక చిత్రాల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ మునుపటి కన్నా చాలా స్పోర్టీగా మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ మాదిరిగానే ఇది బలమైన-పనితీరు గల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకోనుంది. ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ అమ్మకాలను పెంచేందుకు ఈ మోడల్ సహకరించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai has officially unveiled the first set of teaser images of the upcoming all-new i20 premium hatchback. The all-new Hyundai i20 is expected to go on sale in the Indian market sometime in November. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X