కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఇటీవలే తమ సరికొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసినదే. సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీలతో ఈ కొత్త తరం థార్‌ను కంపెనీ డెవలప్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మోడల్‌ను మహీంద్రా అధికారికంగా అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఈ నేపథ్యంలో, 2020 మహీంద్రా థార్‌కు సంబంధించిన ధరల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వచ్చే నెలలో అధికారికంగా విడుదల కావటానికి ముందే, కొత్త థార్ ధరలు వాట్సాప్‌లో లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం, కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ఏఎక్స్ ధర రూ.9.75 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ఏల్ఎక్స్ పెట్రోల్-ఆటోమేటిక్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది (అన్ని ఎక్స్-షోరూమ్, ధరలు).

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

వాట్సాప్‌లో లీక్ అయిన చిత్రం ప్రకారం, కొత్త తరం థార్ కోసం సెప్టెంబర్ 20, 2020వ తేదీ నుండి డీలర్‌షిప్‌లు బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభిస్తాయని, అక్టోబర్ రెండవ వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అయితే, ఈ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతానికి ఇవి ఊహాగానాలు మాత్రమే.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

మునుపటి తరం మోడల్‌తో కొత్త తరం థార్ ఎస్‌యూవీలో డిజైన్, ఫీచర్స్, ఇంజన్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది ఇదివరకటి థార్ కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. మహీంద్రా ఈ కొత్త 2020 థార్ మోడల్‌ను కేవలం ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, రెగ్యులర్‌గా ఉపయోగించుకునే వాహనం మాదిరిగా కూడా తయారు చేసింది.

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:వైద్య వృత్తిని విడిచిపెట్టి ఆటో డ్రైవర్‌గా మారిన గవర్నమెంట్ డాక్టర్, ఎందుకో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.

MOST READ:బొలెరో న్యూ వేరియంట్ లాంచ్ చేసిన మహీంద్రా : దీని ధర ఎంతో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్ వివిధ రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇందులో నాలుగు ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు లేదా రెండు ఫ్రంట్ మరియు నాలుగు సైడ్ ఫేసింగ్ సీట్ల ఆప్షన్‌లో ఇది లభిస్తుంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్ ధరల లీక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2020 మహీంద్రా థార్ ఖచ్చితంగా దాని మునుపటి తరం మోడళ్ల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. ఈ కొత్త తరం ఎస్‌యూవీ ఇప్పుడు మరింత మెరుగైన స్థలం, ప్రీమియం ఇంటీరియర్స్, కొత్త ఇంజన్ ఆప్షన్స్ మరియు తాజా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఒకవేళ ఈ లీకైన ధరలు నిజమైతే, కొత్త 2020 థార్, మహీంద్రా బ్రాండ్‌కు అద్భుతమైన అమ్మకాలను తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
The 2020 Mahindra Thar was recently unveiled to the world. The offroader has been well-received because of its new design, features, performance and technology. The company will be launching the 2020 Thar on October 2, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X