కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ ఆఫ్-రోడ్ వాహనం మహీంద్రా థార్‌లో కంపెనీ ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్స్ చేస్తోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కనథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే, కాగా.. ఇప్పుడు ఈ కొత్త తరం మహీంద్రా థార్‌ను టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది.

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

ఈ కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీని తమిళనాడులో టెస్ట్ చేస్తున్నారు. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన థార్‌ను ఓ నెటిజెన్ బయటి వైపు నుంచి 360 డిగ్రీ వీడియో తీశాడు. ఫలితంగా మార్కెట్లో విడుదల కావటానికి ముందే కొత్త థార్ ఎస్‌యూవీకి సంబంధించిన చాలా వివరాలు, డిజైన్ మార్పులు మరియు అదనపు ఫీచర్లు వెల్లడయ్యాయి.

హెచ్‌ఎండి ఆటోవ్లాగ్స్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన కొత్త 2020 మహీంద్రా థార్ స్పై వీడియో ప్రకారం, రాబోయే ఎస్‌యూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఈ వీడియోలో ఉపయోగించిన టెస్ట్ వెహికల్‌లో 255/65 R18 ప్రొఫైల్‌తో తయారు చేసిన సియట్ CZAR A/T ఆల్-టెర్రైన్ టైర్లను మరియు 18 ఇంచ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించారు. స్పేర్ వీల్‌ను కూడా స్టీల్ వీల్ కాకుండా పూర్తి అల్లాయ్ వీల్‌నే ఆఫర్ చేశారు. ఈ స్పేర్ వీల్‌ను బూట్ డోర్‌కు మౌంట్ చేశారు.

MOST READ: టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్‌ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

అంతే కాకుండా, కొత్త థార్‌కి సంబంధించి ఈ వీడియో లీక్ కావటానికి ముదే కొన్ని డిజైన్ ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పెద్ద వెర్టికల్ స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్‌లతో కూడిన సరికొత్త ఫ్రంట్ ఫాసియా ఉంటుంది. ఇంకా ఇది ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌తో కూడా అందుబాటులోకి రానుంది.

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

కొత్త థార్ ఇంటీరియర్‌లో లోపలి వైపు కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. మునుపటి తరం మహీంద్రా థార్‌తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్‌లో అనేక కొత్త పరికరాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్‌ఐడికి ఇరువైపులా అనలాగ్ డయల్‌లతో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండన్నుట్లు సమాచారం.

MOST READ: మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

మెరుగైన కంఫర్ట్ కోసం మౌంటెడ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆడియో కంట్రోల్స్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా ఇందులో ఉండనుంది. ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్స్, ఫోల్డబిల్ కీ ఫాబ్, మెరుగైన క్రాష్ ప్రొటెక్షన్ మరియు పాదచారుల భద్రత వంటి ఫీచర్లు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో స్టాండర్డ్ ఫీచర్లుగా ఏబిఎస్, సీట్-బెల్ట్ రిమైండర్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

కొత్త తరం 2020 మహీంద్రా థార్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో సరికొత్త 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే కొత్త 2.0-లీటర్ 'టిజిడి ఎమ్‌స్టాలియన్' టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: 'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నాయి. కొత్త తరం ఆఫ్-రోడర్‌ను ఆప్షనల్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఇదివరకే ధృవీకరించిన సంగతి తెలిసినదే.

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

కొత్త తరం మహీంద్రా థార్ స్పై వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాహనాలలో ఈ తర్వాతి మహీంద్రా థార్ కూడా ఒకటి. ఈ ఎస్‌యూవీలో చేసిన అన్ని కొత్త మార్పులు చేర్పుల కారణంగా ఇది మునుపటి తరం మోడల్‌తో పోలిస్తే మరింత ఎక్కువ ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందిస్తుందని అంచనా.

MOST READ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టూరిస్ట్ పర్మిట్ రూల్స్, ఏంటో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్

మహీంద్రా ఈ కొత్త ఎస్‌యూవీని అక్టోబర్ లేదా సెప్టెంబర్‌ నెలల్లో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యమైంది. కొత్త 2020 మహీంద్రా థార్ ఈ సెగ్మెంట్లో నేరుగా ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న గుర్ఖా ఎస్‌యూవీకి పోటీనిచ్చే ఆస్కారం ఉంది. ఫోర్స్ గుర్ఖా కూడా ఇదే సమయంలో అప్‌గ్రేడ్ కానుంది.

Image Courtesy: HMD AutoVlogs/YouTube

Most Read Articles

English summary
Mahindra is gearing up to introduce the next-generation Thar off-road SUV in the Indian market. The SUV has been in the testing phase for a long time even before the nation-wide lockdown came into effect. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X