మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

మహీంద్రా ఈ నెల ఆరంభంలో విడుదల చేసిన సరికొత్త తరం 2020 థార్ ఎస్‌యూవీకి భారత మార్కెట్ నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసినదే.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

కాగా, తాజాగా అందిన సమాచారం ప్రకారం, మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఉత్పత్తికి మించి డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లో ఈ ఆఫ్-రోడర్‌కి వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. కంపెనీ పూర్తిస్థాయిలో ఈ మోడల్ ఉత్పత్తిని చేపట్టినప్పటికీ, రోజురోజుకీ పెరుగుతున్న భారీ డిమాండ్‌ను తీర్చాలంటే కంపెనీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

కొత్త 2020 మహీంద్రా థార్ మార్కెట్లో విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 9,000 యూనిట్ల బుకింగ్‌ను నమోదు చేసిందంటేనే ఈ మోడల్‌పై కస్టమర్లకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 65,000 లకు పైగా ఎంక్వైరీలు మరియు 8 లక్షలకు పైగా వెబ్‌సైట్ సందర్శకులు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

మహీంద్రా థార్ యొక్క అధికారిక డెలివరీలు వచ్చే నెల నుండి ప్రారంభం కానుండగా, ఇప్పటికే దేశంలోని కొంతమంది విఐపిలు లేదా సెలబ్రిటీలు తమ థార్ ఎస్‌యూవీ డెలివరీలను పొందినట్లు సమాచారం. ప్రస్తుతం థార్ ఎస్‌యూవీలో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ 5 నెలల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

కొత్త 2020 థార్ సాఫ్ట్ టాప్ వెర్షన్ కోసం వెయిటింగ్ పీరియడ్ 6-8 వారాలుగా ఉంటే, కన్వర్టిబుల్ టాప్ వేరియంట్ కోసం 8-11 వారాలు మరియు హార్డ్ టాప్ వేరియంట్ కోసం 20-22 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం. అంటే, ఇప్పుడు మహీంద్రా థార్ హార్డ్ టాప్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఏప్రిల్ 2021లో డెలివరీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

ఇప్పటికే థార్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు వివిధ ఫోరమ్‌లలో తమ వెయిటింగ్ పీరియడ్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ గురించి మహీంద్రా ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే, మార్కెట్ డిమాండ్‌కి ఈ మోడల్ ఉత్పత్తిని వేగవంతం చేశామని, పతాకస్థాయిలో ఉత్పత్తిని సాధిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

మహీంద్రా థార్‌కు మునుపెన్నడూ లేనంత భారీ డిమాండ్ రావటానికి ప్రధాన కారణం దీని మోడ్రన్ డిజైన్ మరియు అడ్వాన్స్డ్ ఇంటీరియర్ ఫీచర్లేనని చెప్పవచ్చు. అటు ఆఫ్-రోడ్ ఇటు ఆన్-రోడ్ ప్రియులను మెప్పించే డిజైన్‌తో తయారు చేసిన ఈ కొత్త తరం 2020 మహీంద్రా థార్ కస్టమర్లను తొలిచూపులోనే ఆకట్టుకుంటోంది. దేశీయ మార్కెట్లో కొత్త తరం థార్ ధరలు రూ. 9.8 లక్షల నుంచి రూ. 13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డుపైకి రానున్న కొత్త హోండా హైనెస్ సిబి350 బైక్

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

కొత్త మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఏఎక్స్ వేరియంట్ చాలా తక్కువ ఎలక్ట్రానిక్స్ అసిస్టెన్స్ ఫీచర్లతో హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులను ఉద్దేశించి డిజైన్ చేయబడినది. ఇకపోతే టాప్-ఎండ్ ఎల్ఎక్స్ వేరియంట్ మార్కెట్లో సాధారణ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో తయారు చేయబడినది.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

ఈ కొత్త తరం 2020 మహీంద్రా థార్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా మనం గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.

MOST READ:8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

థార్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..

కొత్త మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పర్‌ఫెక్ట్ ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్న వారిని మహీంద్రా థార్ నిరాశ పరచదనే చెప్పాలి. ఇటీవలే విడుదలైన ఈ కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీ సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. మరి, ఇంతటి పాపులారీ తెచ్చుకున్న ఎస్‌యూవీ కోసం కస్టమర్లు ఐదు నెలలు వెయిట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

Image Courtesy: Amol Shende

Most Read Articles

English summary
Mahindra's next generation Thar SUV has received more than 15,000 bookings since its launch in India. Now the waiting period for this off-roader also went up due to high demand. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X