ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా నుంచి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ థార్ అభిమానులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే, కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీని మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కరిస్తామని కంపెనీ ప్రకటించింది.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

ఇప్పటికే కొత్త తరం మహీంద్రా థార్‌ను కంపెనీ ఏడాదికి పైగా టెస్టింగ్ చేస్తూనే ఉంది. వాస్తవానికి ఈ మోడల్ గడచిన కొన్ని నెలల క్రితమే మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు గతంలో ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇది ఆలస్యమైంది.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

కాగా.. తాజాగా టీమ్‌బిహెచ్‌పి నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, మహీంద్రా ఎట్టకేలకు తమ అధునాతన 2020 థార్‌ను ఆగస్టు 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా కొత్త తరం థార్‌ను మహీంద్రా ప్రపంచానికి పరిచయం చేయనుంది.

MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

దేశంలో కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో, దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఆన్‌లైన్ వేదికగా తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఇదే కోవలో మహీంద్రా కూడా సామాజిక దూరాన్ని పాటించేలా ఆన్‌లైన్ ఈవెంట్‌లో థార్‌ను విడుదల చేయనుంది.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

కొత్త తరం 2020 మహీంద్రా థార్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో సరికొత్త 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే కొత్త 2.0-లీటర్ 'టిజిడిఐ ఎమ్‌స్టాలియన్' టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని రైలు పట్టాలపై నడిచే సైకిల్

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నాయి. కొత్త తరం ఆఫ్-రోడర్‌ను ఆప్షనల్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఇదివరకే ధృవీకరించిన సంగతి తెలిసినదే.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

కొత్త 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పెద్ద వెర్టికల్ స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన బంపర్‌లతో కూడిన సరికొత్త ఫ్రంట్ ఫాసియా కలిగి ఉండనుంది. ఇంకా ఇందులో ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

MOST READ:భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 320డి రీలాంచ్ - ధర, ఫీచర్లు, వివరాలు

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

గతంలో వెల్లడైన స్పై చిత్రాల ప్రకారం, ఈ సరికొత్త మోడల్‌లో 255/65 ఆర్18 ప్రొఫైల్‌తో తయారు చేసిన కొత్త సియట్ ఆల్-టెర్రైన్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లను 18 ఇంచ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై అమర్చారు. స్పేర్ వీల్‌ను పూర్తి అల్లాయ్ వీల్‌తోనే ఆఫర్ చేయనున్నారు. ఈ స్పేర్ వీల్‌ను బూట్ డోర్‌కు అమర్చబడి ఉండనుంది.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

కొత్త థార్ ఇంటీరియర్‌లో లోపలి వైపు కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇందులో ప్రధానంగా ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లను సపోర్ట్ చేసే కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్‌ఐడికి ఇరువైపులా అనలాగ్ డయల్‌లతో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

MOST READ:బైక్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే బిఎస్ 6 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ; ఫుల్ డీటైల్స్

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

ఇంకా ఇందులో మెరుగైన కంఫర్ట్ కోసం స్టీరింగ్ వీల్‌పై క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆడియో కంట్రోల్స్ ఉండే అవకాశం ఉంది. ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్స్, ఫోల్డబిల్ కీ ఫాబ్, మెరుగైన క్రాష్ ప్రొటెక్షన్ మరియు పాదచారుల భద్రత వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. ఏబిఎస్, సీట్-బెల్ట్ రిమైండర్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లను ఇందులో స్టాండర్డ్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఆగస్ట్ 15న కొత్త 2020 మహీంద్రా థార్ ఆవిష్కరణ - అంతా ఆన్‌లైన్‌లోనే!

కొత్త తరం మహీంద్రా థార్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా ఎట్టకేలకు కొత్త తరం 2020 థార్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆగస్ట్ నెలలోనే మహీంద్రా ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాహనాలలో ఈ తర్వాతి తరం మహీంద్రా థార్ కూడా ఒకటి. కొత్త 2020 మహీంద్రా థార్ ఈ సెగ్మెంట్లో నేరుగా ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న గుర్ఖా ఎస్‌యూవీకి పోటీగా నిలుస్తుంది.

Source: Team BHP

Most Read Articles

English summary
The 2020 Mahindra Thar is among the most highly anticipated product launches this year. The next-gen off-roader has been in the testing phase for more than a year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X