కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500'లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఇప్పుడు ఈ ఎస్‌యూవీ సంబంధించిన ఇంటీరియర్స్ వివరాలు, స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 లోపల మరియు బయట అనేక కొత్త ఫీచర్లు మరియు డిజైన్ అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటికే ఈ ఎస్‌యూవీని కర్ణాటక రోడ్లపై కంపెనీ విస్తృతంగా పరీక్షిస్తోంది. పలుమార్లు ఈ టెస్టింగ్ వాహనం కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసినదే. తాజాగా ఎస్‌పి ఆటో టెక్ లీక్ చేసిన స్పై వీడియోలో కొత్త ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ వెల్లడయ్యాయి.

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

ఇందులోని ఇంటీరియర్‌లను గమనిస్తే, క్యాబిన్‌లో ఎక్కువ భాగం క్యామోఫ్లేజ్ చేయబడి ఉన్నప్పటికీ, కొత్త ఎక్స్‌యూవీ500లో అడ్డంగా అమర్చిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని మనం చూడొచ్చు. మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ కార్లలో ఇలాంటి అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మనం చూడొచ్చు.

MOST READ:పిల్లల హెల్మెట్స్ కోసం భారీగా పెరిగిన డిమాండ్.. ఎందుకో తెలుసా?

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

స్టీరింగ్‌కి ఇరువైపులా మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కంట్రోల్స్ సాయంతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని కొన్ని ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ఫోన్ కాల్‌ను స్వీకరించడం మరియు ముగించడం వంటి టెలిఫోనిక్ కార్యకలాపాల కోసం ఇందులో డెడికేటెడ్ బటన్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

సెంట్రల్ కన్సోల్‌కు గమనిస్తే, దీనిని పూర్తిగా రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇందులో కొత్త టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా మనం చూడొచ్చు. ఇది ఇరువైపులా రెండు డయల్స్‌తో కూడిన ట్రెడిషనల్ సెటప్‌లా అనిపిస్తుంది. ప్రస్తుత తరం మోడల్‌లోని బటన్ క్లస్టర్డ్ కన్సోల్ డిజైన్ ఈ కొత్త మోడల్ నుండి తొలగించారు.

MOST READ:తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

సెంటర్ కన్సోల్‌లోని ఇతర ఫీచర్లలో రొటేటరీ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు దాని ప్రక్కన ఒక ఫ్లాగ్ గుర్తుతో ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్ కూడా ఉంది. ఈ రోటరీ డయల్ డ్రైవింగ్ మోడ్ సెలెక్టర్ అని తెలుస్తోంది. అయితే, దానిపై ఉన్న గుర్తు మాత్రం సంగీతం మరియు ఫోన్ చిహ్నాన్ని సూచిస్తుంది.

బహుశా ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఈ డయల్ రెండవ భౌతిక ఇంటర్‌ఫేస్ కావచ్చు. రాబోయే ఎస్‌యూవీని లెవల్ 1 అటానమస్ టెక్నాలజీతో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్‌ (ఏడిఏఎస్)తో అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

MOST READ:ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

అయితే, ఓవరాల్‌గా కొత్త 2021 ఎక్స్‌యూవీ500 ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రం చిరుత నుండి ప్రేరణ పొందిన మొదటి తరం మోడల్ డిజైన్ సిల్హౌట్ మాదిరిగానే ఉంటుంది. కొత్త మోడల్ ఎస్‌యూవీ బోనెట్, బంపర్, గ్రిల్, ల్యాంప్ సెటప్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిల్లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది.

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎక్స్‌యూవీ500లో కొత్త 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

అంతేకాకుండా, మహీంద్రా తమ కొత్త 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బహుశా ఇది 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ కావచ్చు, ఇదే ఇంజన్‌ను కొత్త తరం 2020 మహీంద్రా థార్‌లో కూడా ఉపయోగిస్తు్ననారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి వవర్‌ను మరియు 320 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్ లీక్; వివరాలు

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 క్యాబిన్ లోపల సరికొత్త లేఅవుట్ మరియు డిజైన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. కొత్త అప్‌గ్రేడ్స్‌తో ఇది ఖచ్చితంగా మునపటి కన్నా మరింత మెరుగ్గా, ప్రీమియంగా ఉంటుందనేది మా అభిప్రాయం.

Image Courtesy: SP Auto Tech

Most Read Articles

English summary
Mahindra will be launching a new-generation model of its popular XUV500 SUV in the Indian market sometime next year. The new XUV500 will feature a host of upgrades inside and out over the current-gen SUV model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X