మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

భారత ఆటోమొబైల్ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సరికొత్త 'ఎక్స్‌యూవీ500' (XUV500) మరియు 'స్కార్పియో' (Scorpio) వాహనాల్లో ఇప్పట్లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను విడుదల చేయలేమని కంపెనీ పేర్కొంది. దేశంలో కోవిడ్-19 తెచ్చిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వెర్షన్ల విడుదలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) వాయిదా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

వాస్తవానికి మహీంద్రా ఇప్పటికే ఈ ఎక్స్‌యూవీ500 మరియు స్కార్పియో వాహనాల్లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లు తయారు చేసి టెస్టింగ్ చేస్తోంది. వాస్తవానికి ఈ రెండు మోడళ్లను ఈ ఏడాదిలోనే మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావించింది. అయితే, ప్రస్తుత కోవిడ్-19 కారణంగా ఏర్పడిన పరిస్థితులు, రెండు నెలల పాటు ప్రొడక్షన్ నిలిచిపోవటం వంటి అనేక కారణాల వల్ల వీటి విడుదల ఆలస్యమైంది.

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

మహీంద్రా ఆటోమోటివ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ అయిన పవన్ గోయెంకా కంపెనీ నాల్గవ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి మార్చ్ 2020 మధ్య కాలంలో తమ కంపెనీ భారీ నష్టాలను చవిచూసిందని, ఈ సమయంలో రూ.3,255 కోట్ల నష్ట వాటిళ్లిందని ఆయన వివరించారు.

MOST READ: దొంగలించిన 6 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన మాజీ ముఖ్యమంత్రి కారు

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 గురించి ప్రస్తావిస్తూ.. ఇందులో సరికొత్త మోడల్‌ను కూడా ప్రస్తుత మోనోకాక్యూ ఛాస్సిస్‌పైనే తయారు చేస్తూ అలానే ఇందులో మరో సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేస్తున్నామని తెలిపారు.

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

అంతేకాకుండా ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఎస్‌యూవీలో కొత్తగా 2.0 లీటర్ ఎమ్‌స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించనున్నారు. ఈ రెండు ఇంజన్లు కూడా మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నాయి.

MOST READ: సరికొత్త 2020 మహీంద్రా థార్ విడుదల ఖరారు; వివరాలు

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

ఇక సరికొత్త మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే.. దీన్ని కూడా అప్‌డేటెట్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ప్రస్తుత వెర్షన్ స్కార్పియోని ల్యాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్‌పై తయారు చేస్తున్నారు. ఇందులో మాత్రం ప్రస్తుత బిఎస్6 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌లను యధావిధిగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

ఎక్స్‌యూవీ500, స్కార్పియో మోడళ్లలో చాలా రోజుల తర్వాత సరికొత్త వెర్షన్లు వస్తున్న నేపథ్యంలో వీటి డిజైన్ మరియు ఇంటీరియర్లతో పాటు కొన్ని రకాల ఫీచర్లలో కీలకమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే మరి.

MOST READ: స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

మరోవైపు.. కోవిడ్-19 కారణంగా తమ సరికొత్త థార్ ఎస్‌యూవీ విడుదల కూడా జాప్యమైందని పవన్ గోయెంకా తెలిపారు. అయితే, ఈ సరికొత్త 2020 మహీంద్రా థార్‌ని మాత్రం ఈ ఏడాదిలోనే మార్కెట్లో విడుదల చేస్తామని ఆయన వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా డిజైన్ చేసిన కొత్త థార్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని గోయెంకా తెలిపారు.

మహీంద్రా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో విడుదల వాయిదా

కొత్త ఎక్స్‌యూవీ500, స్కార్పియో మోడళ్ల జాప్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్రస్థాయి ప్రభావాన్ని చూపింది. మహీంద్రా కూడా భారీ నష్టాలను చవిచూసింది. రెండు నెలలుగా ఉత్పత్తి మరియు అమ్మకాలు నిలిచిపోవటంతో మహీంద్రా కొత్త వాహనాల విడుదల వాయిదా పడింది, అలాగే ఇప్పటికే తయారైన వాహనాలను విక్రయించేందుకు మహీంద్రా కృషి చేస్తోంది. ఇదే సమయంలో కొత్త వాహనాల అభివృద్ధిపై కూడా కంపెనీ రాకెట్ స్పీడ్‌లో పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Most Read Articles

English summary
Mahindra has announced that the launch of their two upcoming SUVs, the next-generation XUV500 and Scorpio has been postponed. The launch of the next-generation XUV500 and Scorpio SUVs has now been deferred to the next financial year (FY 2021-22). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X