2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

భారతదేశంలో అతి పెద్ద వాహనతయారీ దారుగా పేరుగాంచిన సంస్థ మారుతి సుజుకి. మారుతి నుంచి విడిదలైన వాహనాలు ఎక్కువ ప్రజాదరణను పొందాయి. ఇప్పుడు 2020 ఆటో ఎక్స్‌పోలో బిఎస్-6 మారుతి ఇగ్నిస్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ బిఎస్-6 మారుతి ఇగ్నిస్ గురించి మరిన్ని ప్రత్యేకమైన విషయాలు ఇప్పుడు మీకోసం.

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతీ సుజుకి, ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఇది బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడింది. కాస్మెటిక్ ట్వీక్స్ మరియు మరికొన్ని ఫీచర్లతో ఇప్పుడు ఇగ్నిస్ అప్‌డేట్ చేసింది. మారుతీ ఇగ్నిస్ యొక్క బుకింగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

కొత్త నవీనీకరణలతో తయారు చేసిన ఇగ్నిస్ లో 1.2 లీటర్ కె 12 ఇంజిన్ ని బిఎస్-6 వెర్షన్ కి అనుగుణంగా మార్చడం జరిగింది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి ఆటో ఎంపికలు మునుపటిలాగే ఉన్నాయి. ఇంజిన్ బిఎస్-4 వెర్షన్ లాగ 83 hp మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతీ సుజుకి ఇగ్నిస్ లాంచ్ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'సివి రామన్' మాట్లాడుతూ గతంలో ఆటోమేటిక్ వెర్షన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. కాబట్టి ఈ వెర్షన్ కి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని వెల్లడించాడు.

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతీ ఇగ్నిస్ డిజైన్ పరంగా కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు రెండూ కూడా ఫాక్స్ స్కఫ్ ప్లేట్‌లను పొందుతాయి. హ్యాచ్‌బ్యాక్‌ను జిమ్మీ ఎస్‌యూవీకి అనుసంధానించే కొత్త గ్రిల్, ప్రీ-ఫేస్‌లిఫ్ట్ లను కలిగి ఉంటుంది

మారుతీ ఇగ్నిస్ రెండు రంగులలో ఉంటుంది. ఒకటి లూసెంట్ ఆరెంజ్, రెండు టర్కోయిస్ బ్లూ. అదే విధంగా మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ అప్సన్లను కూడా కలిగి ఉంటుంది. అవి నెక్సా బ్లూ విత్ బ్లాక్, లూసెంట్ ఆరెంజ్, మరియు నెక్సా బ్లూ విత్ సిల్వర్

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

ఇందులో క్యాబిన్ విశాలంగా ఉంటుంది. డాష్‌బోర్డ్ మాత్రం మునుపటి మోడల్ లాగే ఉంటుంది. 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆన్-బోర్డ్ నావిగేషన్ వంటివి ఉంటాయి. ఎస్ కనెక్ట్ కనెక్టివిటీ సూట్ మాత్రం ఇందులో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది.

2020 ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి ఇగ్నిస్ చాల అప్డేటెడ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది దాని మునుపటి వెర్షన్ కంటే కూడా ఉత్తమైనది. బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా వినియోగదారునికి అనుకూలమైన ఎస్‌యువి గా ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Ignis gets a reboot for 2020. Read in Telugu.
Story first published: Friday, February 7, 2020, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X