2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

జర్మన్ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో కొత్త బెంజ్ జిఎల్‌సి కూపేను విడుదల చేసింది. బెంజ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త జిఎల్‌సి కూపే గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త బెంజ్ యొక్క ప్రారంభ ధర రూ. 62.70 లక్షలు(ఎక్స్‌-షోరూమ్, ఇండియా). కొత్త బెంజ్ జిఎల్‌సి కూపే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో డెలివరీలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే కొత్త ఫీచర్లను కలిగి ఉంది. దీనికి సరికొత్త ఎంబియుఎక్స్ కనెక్ట్ టెక్నాలజీ కూడా ఉంది. బెంజ్ జిఎల్‌సి కూపే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి 300 డి 4 మాటిక్ మరియు 300 ఫోర్ మాటిక్. జిఎల్‌సి కూపే యొక్క హైయ్యర్ డీజిల్ స్పెక్ వేరియంట్ ధర ప్రీమియం రూ .63.70 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా).

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

జర్మన్ బ్రాండ్ అయిన బెంజ్ జిఎల్‌సి కూపే యొక్క ఎఎమ్‌జి వెర్షన్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా దిగుమతి చేసుకున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఈ బ్రాండ్ యొక్క 10 వ మోడల్.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే సరికొత్త డిజైన్లను కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ఫ్రంట్ ఫాసియాలో బ్రాండ్ యొక్క డైమండ్-ప్యాటర్న్ గ్రిల్ ఉంటుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో (డేటైమ్ రన్నింగ్ లైట్స్) ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్‌తో ఇరువైపులా ఉంటుంది. అంతే కాకుండా కొద్దిగా అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బంపర్‌ను కూడా అందుకుంటుంది. వెనుక వైపున నవీనీకరించిన ఎల్‌ఈడీ టైల్లైట్స్, కొత్త ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉంటాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపేలో మాడిఫైడ్ చేయబడిన ఇంటీరియర్‌, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లేలో బ్రాండ్ యొక్క ఎంబియుఎక్స్ (మెర్సిడెస్ బెంజ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్) సాంకేతికత కూడా ఉంది. 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు ఇతర ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

కొత్త బెంజ్ జిఎల్‌సి కూపే రెండు ఇంజిన్లను కలిగి ఉంటుంది. అవి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 డీజిల్ ఇంజిన్ యూనిట్లు. జిఎల్‌సి కూపే 300 ఫోర్ మాటిక్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 258 బిహెచ్‌పి మరియు 370 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

బెంజ్ యొక్క జిఎల్‌సి కూపే 300 డి 4 మాటిక్ 2.0 లీటర్ డీజిల్‌ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 245 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉండే రెండు ఇంజన్లు ప్రామాణిక 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ మార్టిన్ ష్వెంక్ మాటాడుతూ, జిఎల్‌సి కూపే లగ్జరీ ఎస్‌యువి విభాగంలో సాటిలేని ఉత్పత్తి సమర్పణగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఈ కొత్త బెంజ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను చేపడుతున్నదని ఆసిస్తున్నామన్నారు.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపే : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో బెంజ్ సంస్థ అనేక ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో తన ఉనికిని మరింత విస్తరించడానికి యోచిస్తోంది. అంతే కాకుండా వచ్చే ఏడాదిలోపు మరిన్ని లగ్జరీ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Most Read Articles

English summary
2020 Mercedes-Benz GLC Coupe Launched In India: Prices Start At Rs 62.70 Lakh. Read in Telugu.
Story first published: Tuesday, March 3, 2020, 15:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X