ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

భారత మార్కెట్లో సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా ప్రవేశపెట్టిన వాహనం ఏది అంటే, వెంటనే గుర్తుకు వచ్చేది టాటా నానో కార్. ఈ టాటా నానో కార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లో రావడానికి అన్ని సన్నాహాలను సిద్ధం చేసుకుంటోంది. టాటా మోటార్స్ మరియు జయెం ఆటోమోటివ్స్ సంయుక్తంగా దేశంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి రెండు సంస్థలు 2017 లో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

జయెం నియో బ్రాండ్ కింద నానో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడమే వీటి ప్రధాన లక్ష్యం. ఈ కారు ఇప్పటికే చాలాసార్లు స్పాట్-టెస్ట్ చేయబడింది. అయితే గత రెండేళ్లుగా ఈ కొత్త టాటా నానో ఎలక్ట్రిక్ కారు గురించి కంపెనీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఇటీవల పూణే సమీపంలో స్పాట్ టెస్ట్ నిర్వహించింది. జయెం నియో అనే టాటా నానో ఎలక్ట్రిక్ కారు యొక్క కొన్ని స్పాట్ టెస్ట్ ఫోటోలు ఇటీవల బయటపడ్డాయి. ఈ ఫొటోలో ఎలక్ట్రిక్ కారుకి బ్యాడ్జింగ్ నియో ఉంటుంది. అంతే కాకుండా ఈ ఫోటోలలో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కూడా గుర్తించబడింది.

MOST READ:కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

జయెం నియోను దేశంలో సిటీ టాక్సీ వాహనంగా ప్రయోగించాలని భావించారు. ప్రారంభంలో కంపెనీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ యొక్క ఓలా ఎలక్ట్రిక్ 400 యూనిట్లను సరఫరా చేయాల్సి వచ్చింది. దేశంలో నానో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేయడానికి టాటా మోటార్స్ మరియు జయెం నియో ఆటో సన్నద్ధమవుతున్నాయి.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

కొత్తగా రానున్న ఈ ఎలక్ట్రిక్ కారును జయెం నియో అనే పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ జయెం నియో కారు రూపకల్పన విషయానికొస్తే, టాటా నానో యొక్క అదే డిజైన్‌ను కలిగి ఉంది. లోపలి భాగంలో ఇదే డిజైన్ పొందుతుంది.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

ఈ కొత్త నానో ఎలక్ట్రిక్ కారులో 17.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటారు అమర్చబడి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 23 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది ఒకసారి పుల్ ఛార్జ్ తో దాదాపు 203 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 85 కి.మీ.

భారతదేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలామంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు టాటా నానో కార్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో రానుంది.

MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

కొత్తగా రానున్న ఈ నానో ఎలక్ట్రిక్ కార్ కొత్త సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాంచ్ అయిన ఈ చిన్న కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్లో రావడానికి సంసిద్దమవుతోంది. ఏది ఏమైనా ఈ నానో ఎలక్ట్రిక్ కారుని కొత్త సేఫ్టీ ఫీచర్స్ కి అనుకూలంగా తయారుచేయడం అనేది తయారీదారులకు నిజంగా ఒక సవాలులాంటిదనే చెప్పాలి.

Image Courtesy: SMILEY TAMILAN TECH And Pravin Nair/Rushlane Spylane

Most Read Articles

English summary
Tata Nano Electric Spotted Testing Revealing. Read in Telugu.
Story first published: Thursday, December 31, 2020, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X