కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్‌పివి) "ఇన్నావో క్రిస్టా"లో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలవుతుందని అంచనా.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

ఈ నేపథ్యంలో, కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాకు సంబంధించిన వివరాలు, బ్రోచర్ ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఇదే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నారు.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

అయితే, అందరికన్నా ముందుగా కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే కొత్త ఇన్నోవా క్రిస్టా దేశంలోని ప్రధాన డీలర్‌షిప్‌లకు పంపబడినట్లుగా తెలుస్తోంది. తాజాగా లీకైన ఫొటోలు ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్‌లోని చేయబడిన మార్పులు, ఫీచర్లను వెల్లడిస్తున్నాయి.

MOST READ:ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

రష్లేన్ విడుదల చేసిన స్పై చిత్రాలను గమనిస్తే, టొయోటా పాపులర్ ఎమ్‌పివి ఇప్పుడు సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొత్త 2021 మోడల్ ఇయర్‌కి చెందిన ఇన్నోవా క్రిస్టాలో ఇదే ప్రధానమైన మార్పుగా ఉండనుంది. ఇంకా ఇందులో కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, రీవర్క్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌లు కూడా ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో అప్‌డేట్ చేసిన ఫాగ్ ల్యాంప్స్ మరియు వాటి చుట్టూ క్రోమ్ ఇన్సర్ట్‌లు కూడా కనిపిస్తాయి.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

అలాగే, దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, కొత్త ఇంటర్నల్స్‌తో కూడిన కాంబినేషన్ టెయిల్ ల్యాంప్స్ మరియు టాప్-ఎండ్ వేరియంట్లలో ఇంటిగ్రేటెడ్ రూఫ్-స్పాయిలర్ వంటి మార్పులను చూడొచ్చ. కొత్త ఇన్నోవా క్రిస్టాలో అల్లాయ్ వీల్ డిజైన్‌ను కూడా అప్‌డేట్ చేశారు, ఇప్పుడు ఇవి డ్యూయల్ టోన్ లుక్‌ను కలిగి ఉంటాయి.

MOST READ:తండ్రి ఇచ్చిన కారును అంబులెన్స్‌గా మార్చిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

పైన పేర్కొన్న కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇందులో పెద్ద మార్పులు ఏవీ లేవని తెలుస్తోంది. చూడటానికి కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా మొత్తం సిల్హౌట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. టొయోటా ఇన్నోవా ఎమ్‌పివి దాని గొప్ప మరియు సొగసైన డిజైన్ కారణంగా ఎల్లప్పుడూ అద్భుతమైన రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది, కొత్త మోడల్ కూడా ఇదేరకంగా ఉండనుంది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

ఇంటీరియర్స్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తూ పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో సీట్ అప్‌హోలెస్ట్రీ, డోర్ ఇన్‌సెర్ట్స్‌ను కూడా కంపెనీ కొత్త కలర్లతో రీడిజైన్ చేసింది.

MOST READ:ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

టాప్-ఎండ్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా మోడల్‌లో టొయోటా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పార్క్ అసిస్ట్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఎమ్ఐడి స్క్రీన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

ఇంజన్ పరంగా కొత్త ఇన్నోవా క్రిస్టాలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం టొయోటా ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో మొదటిది 2.7-లీటర్ పెట్రోల్ మరియు రెండవది 2.4-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.4-లీటర్ డీజిల్ యూనిట్ గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తాయి.

MOST READ:మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

ఇండియన్ వెర్షన్ 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా కూడా అంతర్జాతీయ మోడళ్ల మాదిరిగానే అన్ని రకాల అప్‌డేట్స్‌ను కలిగి ఉంటుందని అంచనా. కాగా, టొయోటాకిర్లోస్కర్ మోటార్స్ ఇంకా, భారత మార్కెట్లో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఇన్నోవా క్రిస్టా విడుదల విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.15.66 లక్షల నుండి రూ.23.63 మధ్యలో ఉన్నాయి. కాగా, కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టాలో చేయబోయే ప్రీమియం అప్‌గ్రేడ్స్ కారణంగా దాని ధర కూడా ప్రస్తుత మోడళ్ల కాస్తంగా అధికంగా ఉండొచ్చని అంచనా.

కొత్త 2021 టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాతో పోలిస్తో కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ టొయోటా ఇన్నోవా క్రిస్టా ముందు వైపు పూర్తిగా కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎంపివి ఇంటీరియర్‌లలో కూడా కీలకమైన అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ కొత్త మార్పులతో రానున్న ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ మరింత ఎక్కువ మంది వినియోగదారులను తనవైపుకు ఆకర్షించే అవకాశం ఉంది.

Source:Rushlane

Most Read Articles

English summary
2021 Toyota Innova Crysta is expected to arrive sometime early next year in the Indian market. Ahead of its India launch, the Innova Crysta facelift is all set to launch in various international markets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X