Just In
- 53 min ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 1 hr ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 4 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 21 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
Don't Miss
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
రాక్ చేసేందుకు సిద్దమైన వోక్స్వ్యాగన్ టి-రాక్ ఎస్యూవీ: బుకింగ్స్ షురూ!
వోక్స్వ్యాగన్ కంపెనీ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న వోక్స్వ్యాగన్ టి-రాక్ 5-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీని తమ అఫీషియల్ వెబ్సైట్లో చేర్చింది. ఏప్రిల్ 2020లో విడుదల కానున్న వోక్స్వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీపై ఇప్పటికే అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
వోక్స్వ్యాగన్ తొలుత దీనిని కంప్లీట్లి బిల్ట్ యూనిట్(CBU) కింద దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయించనుంది. డిమాండ్ పెరిగితే పూర్తి స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ప్రీమియం 5-సీటర్ ఎస్‌యూవీగా వస్తోన్న వోక్స్వ్యాగన్ టి-రాక్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లో మాత్రమే లభించనుంది. సాంకేతికంగా ఇందులోని 1.5-లీటర్ 4-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150బిహెచ్పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
7-స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ (డైరక్ట్ క్లచ్ ట్రాన్స్మిషన్) గేర్‌బాక్స్‌తో లభించే వోక్స్వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క సరికొత్త ఎమ్‌క్యూబీ ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేశారు. వోక్స్వ్యాగన్ టిగువాన్ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీని కూడా అదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా తీసుకొచ్చారు.
వోక్స్వ్యాగన్ టి-రాక్ ఎస్‌యూవీలోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పానరొమిక్ సన్‌రూఫ్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపుతో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ క్లస్టర్, వియన్నా లెథర్ సీట్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమోట్రోనిక్ ఏసీ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ మరియు కీలెస్ స్టార్ట్ వంటివి ప్రధానంగా ఉన్నాయి.
ప్రయాణికుల సేఫ్టీ పరంగా ఆరు విభిన్న ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో వచ్చాయి.
వోక్స్వ్యాగన్ టి-రాక్ ఎస్యూవీ పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టుసాన్ మోడళ్లకు ధీటైన పోటీనిస్తుంది. దీని ధర సుమారుగా రూ. 18 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఉండవచ్చు.