బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి వల్ల కొన్ని ఆటో షోలు రద్దు చేయబడ్డాయి. ఆటో షోల వల్ల చాలామంది జనం గుమికూడటం వల్ల కరోనా వైరస్ మరింత ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆటో షోలో రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు న్యూయార్క్ ఆటో షో రీ షెడ్యూల్ చేయబడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

ఈ సంవత్సరం జెనీవా ఆటో షో రద్దు అయిన తరువాత, 2020 న్యూయార్క్ ఆటో షోను రీ షెడ్యూల్ చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. సాధారణంగా ఈ ఆటో షో ఈ సంవత్సరం ఏప్రిల్ 10 నుంచి 19 మధ్య జరగాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యం వల్ల దానిని కొంత రీ షెడ్యూల్ చేయవలసి వచ్చింది.

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

కరోనా వైరస్ వల్ల ఎట్టకేలకు ఈ మోటార్ షో ఇప్పుడు షెడ్యూల్ చేయబడింది. ఈ న్యూయార్క్ ఆటో షో 2020 ఆగస్టు 28 మరియు సెప్టెంబర్ 6 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ ప్రదర్శన 330 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతుంది. అంతే కాకుండా ఇది స్థానిక మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై భారీ ప్రభావాన్ని చూపింది.

MOST READ: లాక్‌డౌన్ ఎఫెక్ట్ : నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయనున్న రాపిడో

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

గ్రేటర్ న్యూయార్క్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిస్టర్ మార్క్ షియెన్‌బర్గ్ మాట్లాడుతూ, హాజరైనవారు, ప్రదర్శనకారులు మరియు పాల్గొనే వారందరినీ కరోనావైరస్ నుండి రక్షించడం కోసం మేము ఈ చర్యను తీసుకుంటున్నామన్నారు.

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

120 సంవత్సరాలుగా ఈ ఆటో షో కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా మళ్ళీ రీ షెడ్యూల్ చేయడం వల్ల కొత్త తేదీలను ప్రకటించడానికి సాధ్యమైంది. సాధారణంగా మా మొదటి ప్రాధాన్యత అందరి ఆరోగ్యం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ కరోనా మహమ్మారి భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఈ కొత్త తేదీలలో ఆటో షో ని జరుపుతామని నమ్మకంతో ఉన్నామని ఆయన ప్రస్థావించారు.

MOST READ:ఇండియన్ డాక్టరుకి 100 వాహనాల్లో సెల్యూట్ చేసిన అమెరికా ప్రజలు, ఎందుకో తెలుసా..?

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

దీనికి సంబంధిత మరిన్ని వార్తల ప్రకారం పెబుల్ బీచ్ కాంకోర్స్ డి ఎలెగాన్స్ యొక్క 2020 ఎడిషన్ రద్దు చేయబడింది మరియు 2021 ఆగస్టు 15 న షెడ్యూల్ చేయబడింది. ఈ కార్యక్రమం మొదట ఈ సంవత్సరం ఆగస్టు 16 న షెడ్యూల్ చేయబడింది.

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

పెబుల్ బీచ్ కాంకోర్స్ డి ఎలెగాన్స్ ఈ సంవత్సరం తన 70 వ ఎడిషన్‌ను ప్రకటించిన తేదీలో జరపకపోవడం నిజంగా నిరాశపరిచింది. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు మరియు ప్రకటనలు ఉంటాయని కాబట్టి ఈ ఈవెంట్ ఒక మైలురాయిగా ఉంటుంది అని ఊహించారు.

MOST READ:అమ్మకాలలో హోండానే అధిగమించిన హీరో మోటోకార్ప్

బ్రేకింగ్ న్యూస్.. న్యూయార్క్ మోటార్ షో రీ షెడ్యూల్ డేట్స్ వచ్చేశాయ్

రీ షెడ్యూల్ చేసిన ఈ ఈవెంట్ మాత్రం అనుకున్నట్లుగానే ఉంటుంది, స్టిల్‌వాటర్ కోవ్‌తో పాటు గత బెస్ట్ ఆఫ్ షో విజేతల ప్రదర్శన, మరియు పినిన్‌ఫరీనా కోచ్‌వర్క్‌పై దృష్టి సారించే ప్రత్యేక వర్గాలు, ఇతరులతో పాటు ఇది కచ్చితంగా ప్రదర్శించబడుతుంది.

Most Read Articles

English summary
New York Motor Show 2020 Rescheduled For 28 August This Year. Read in Telugu.
Story first published: Friday, April 24, 2020, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X