కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

కియా మోటార్స్ న్యూ జనరేషన్ కియా సోరెంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ కారును రివీల్ చేసింది. అతి త్వరలో జరగబోయే 2020 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించనున్న కియా సోరెంటో కారుకు సంభందించిన పూర్తి వివరాలను కియా వెల్లడించింది.

మారుతి వితారా బ్రిజాకు గట్టి పోటీనిచ్చి, కియా సెల్టోస్ తరహాలో భారీ విజయాన్ని సొంతం ఉద్దేశ్యంతో సిద్దం చేసిన కియా సోరెంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్, ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్లకు సంభందించిన ఫోటోలను కియా మోటార్స్ రిలీజ్ చేసింది. కియా సోరెంటో గురించి పూర్తి వివరాల కోసం...

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

కొరియన్ దిగ్గజం అంతర్జాతీయ విపణిలో విక్రయిస్తున్న కియా సోరెంటో యూరోపియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. ఇండియన్ మార్కెట్లో విడుదల ఖరారు చేసిన మోడళ్లలో కియా సోరెంటో ఒకటి.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

ఇప్పటికే కియా సెల్టోస్ ఎస్‌యూవీతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కియా మోటార్స్, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ దున్నేయడానికి కియా సోరెంటో ఎస్‌యూవీని తమ మూడవ ఉత్పత్తిగా తీసుకొస్తోంది. ఇటీవల జరిగిన 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌ పోలో ఆవిష్కరిచిన కియా కార్నివాల్ లగ్జరీ ఎంపీవీని తమ రెండవ మోడల్‌గా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

కియా సోరెంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇండియా విడుదలను కియా ప్రతినిధులు ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ విపణిలో ఉన్న కియా సోరెంటో మోడల్‌ను ఫోర్త్-జనరేషన్ (నాలుగో తరం) మోడల్‌ను ప్రదర్శించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నాలుగో తరానికి చెందిన సోరెంటో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ నుండి ఎంతో కొత్తగా ఉంది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

పేరుకు కొరియన్ కారే అయినప్పటికీ, డిజైన్ పరంగా అమెరికన్ కార్ల తరహాలో డిజైన్ పరంగా ఎన్నో మార్పులు జరిగాయి. ఫ్రంట్ డిజైన్‌లోని టైగర్-నోస్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ జోడింపుతో కూడిన ఫ్రంట్ బంపర్, కండలు తిరిగిన రూపం మరియు కారుకు ఇరువైపులా స్టైలిష్ క్యారెక్టర్ లైన్స్ మరియు ధృడమైన అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

రియర్ డిజైన్‌లో రెండుగా విడిపోయిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఇరువైపులా ఉన్న ఎగ్జాస్ట్ పైపులకు మధ్యలో ఫాక్స్ డిఫ్యూజర్ కలదు. ఓవరాల్ డిజైన్ పరంగా గమనిస్తే నాలుగో తరానికి చెందిన కియా సోరెంటో ఎస్‌యూవీ చాలా పెద్దగా ఉంది. యూరోపియన్ మరియు ఇతర విదేశీ మార్కెట్ల కోసం తయారు చేసింది కావడంతో కొలతల పరంగా ఇండియన్ వెర్షన్ కంటే పెద్దగా ఉంటుంది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

ఇంజన్ విషయానికొస్తే, కియా సోరెంటో పెట్రోల్, డీజల్ మరియు హైబ్రిడ్ ఆప్షన్లలో లభిస్తుంది. 2.2-లీటర్ డీజల్ ఇంజన్ 202బిహెచ్‌పి పవర్, 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ 230బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇందులోని బ్యాటరీ ద్వారా పనిచేసే 1.5kWh ఎలక్ట్రిక్ మోటర్ మాత్రమే 60బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

కియా సోరెంటో డ్రైవ్ ఆప్షన్ల విషయానికొస్తే.. ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లో లభిస్తుంది. కియా అతి త్వరలో సోరెంటో ఎస్‌యూవీని 16.6kWh ఎలక్ట్రిక్ మోటార్ గల ప్లగ్-ఇన్-హైబ్రిడ్ వెర్షన్‌లో ప్రవేశపెట్టాలని కియా భావిస్తోంది. ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభించే ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

ప్రత్యేకించి యూరోపియన్ మార్కెట్ కోసం సిద్దం చేసిన సోరెంటో ఎస్‌యూవీ ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్జ్ లేఔట్‌ను పూర్తిగా మార్చేశారు. ఇంటీరియర్ కలర్ స్కీమ్స్ కూడా మారే అవకాశం ఉంది. మెర్సిడెస్ బెంజ్ కార్లలో కనిపించే ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే మరియు ఇస్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ల్పే తరహాలో అత్యాధునిక కనెక్టెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో పరిచయం చేస్తున్నారు.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

ఫ్రంట్ మరియు రియర్ క్యాబిన్ కోసం వేర్వేరు ఏసీ వెంట్స్ మరియు క్లైమేట్ కంట్రోల్ డిస్ల్పేలు ఉన్నాయి. సేఫ్టీ పరంగా అన్ని హై ఎండ్ సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా ఇందులో అందిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే యూరోపియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మెర్సిడెస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీలకు ధీటైన పోటీనిస్తుంది.

 కియా సోరెంటో ఎస్‌యూవీని రివీల్ చేసిన కియా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ సోరెంటో ఎస్‌యూవీని అమెరికన్ మరియు యూరోపియన్ మార్కెట్ల లక్ష్యంగా అభివృద్ది చేసింది. నాలుగో తరానికి చెందిన ఈ మోడల్‌ను ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు లేవు. అయితే, దేశీయంగా అత్యంత ప్రసిద్దిగాంచిన కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కోసం సోరెంటో ఎస్‌యూవీని మారుతి బ్రిజా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా తీసుకొచ్చేందుకు కియా ప్రయత్నిస్తోంది.

Most Read Articles

English summary
Next-gen Kia Sorento Revealed Ahead Of Debut At Geneva Motor Show. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X