Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు
భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి నుంచి రానున్న కొత్త 2020 సెలెరియో పూర్తిగా కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుందని సమాచారం.

మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే తమ కొత్త తరం సెలెరియో కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ సెలెరియో ఈ ఏడాది దీపావళి నాటికి భారత మార్కెట్లలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇది ప్రస్తుత సెలెరియోకి ఫేస్‌లిఫ్ట్‌లా కాకుండా, పూర్తిగా రిఫ్రెష్ డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది.

కొత్త తరం సెలెరియో పరిమాణంలో కాస్తంత పెద్దగా ఉండొచ్చని సమాచారం. ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్స్‌లో కూడా రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటుగా అప్‌డేటెడ్ మెకానికల్స్ కూడా ఉండనున్నాయి. అంటే, ఇంజన్ పరంగా కూడా కొత్త సెలెరియోలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
MOST READ: టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి

కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ‘హియర్‌టెక్ట్' ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయవచ్చని తెలుస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై వ్యాగన్ఆర్ కారును కూడా తయారు చేస్తున్నారు. వ్యాగన్ఆర్ మాదిరిగానే, కొత్త తరం సెలెరియో బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మరిన్ని ఇతర పరికరాలను షేర్ చేసుకునే అవకాశం ఉంది.

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోను వాగన్ఆర్ మాదిరిగానే రెండు ఇంజన్ ఆప్షన్లతో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో బిఎస్6 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ రెండు ఇంజన్ల పవర్, టార్క్ గణాంకాలు ప్రస్తుత వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌తో సమానంగా ఉంటాయి. కొత్త సెలెరియో 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి సెలెరియో కారును తొలిసారిగా 2014లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. కంపెనీ నుండి ఎంట్రీ లెవల్ కార్ విభాగంలో లభ్యమవుతున్న సెలెరియో ధరలు రూ.4.46 లక్షల నుండి రూ.5.73 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

కాగా.. మారుతి సుజుకి నుంచి కొత్తగా రానున్న నెక్స్ట్ జనరేషన్ సెలెరియో ఆఫర్ చేయబోయే ప్రీమియం ఫీచర్ల కారణంగా దాని ధర కూడా ప్రీమియంగానే ఉండే అవకాశం ఉంది. కొత్త మారుతి సెలెరియో గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియకపోయినప్పటికీ, మార్కెట్లో దీని ధరలు రూ.5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.
MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత తరం సెలెరియోతో పోల్చుకుంటే కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ కొత్త తరం సెలెరియో ఈ విభాగంలోని టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.
Source:Autocar India