ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

ప్రస్తుతం పారిపోయి యుకెలో తల దాచుకుంటున్న నీరవ్ మోడీ గురించి అందరికి తెలుసు. యితడు చేసిన కుంబకోణాలవల్ల భారదేశం నుంచి పారిపోయి యుకెలో ఉన్నాడు. నీరవ్ మోడీ ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికే నీరవ్ మోడీకి సంబంధించిన కొన్ని ఆస్తులు వేలం వేయడం కూడా జరిగింది. మిగిలిన వాటిని త్వరలో బహిరంగంగా వేలం వేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వేలం నిర్వహించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాఫ్రోనార్ట్ ఆక్షన్ హౌస్ ని ఎంచుకుంది. ఫిబ్రవరి 27 న ఆక్షన్ హౌస్ బహిరంగ వేలం, ఆపై స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆన్‌లైన్ వేలం మార్చి 3 మరియు 4 తేదీలలో జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

అంతే కాకుండా నీరవ్ మోడీ యొక్క పోర్స్చే పనామెరా, రోల్స్ రాయిస్ ఘోస్ట్ మరియు అధిక-విలువైన పెయింటింగ్స్‌తో సహా మొత్తం 112 వస్తువులు ఆన్‌లైన్‌లో విక్రయించబడుతుంది.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

సాధారణంగా రూ. 1.5 కోట్ల రూపాయల ధర కలిగిన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మరియు రూ. 60 లక్షల విలువ కల్గిన పోర్చే పనామెరాను విక్రయించడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంతకు ముందు విఫలమైంది. కానీ ఇప్పుడు వెల్లడించిన కొత్త నివేదికల ప్రకారం రోల్స్ రాయిస్ ఘోస్ట్ రూ. 75 లక్షల నుంచి రూ. 95 లక్షల వరకు అమ్మబడుతుంది. కానీ పోర్చే పనామెరాపై ఇటువంటి ఆలోచనలేదు.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

MSTC నిర్వహించిన చివరి వేలంలో 37.8 లక్షల మూల ధరను కలిగి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్‌ను ఇడి విజయవంతంగా విక్రయించింది. మరో ఏడూ కార్లు వేలం వేయడానికి ఆమోదించలేదు. ఇడి వేలంలో ఎక్కువ డబ్బును ఆశించినంతగా రాలేదు.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

నీరవ్ మోడీ నుంచి రెండు వేర్వేరు రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తెలుపు రంగు రోల్స్ రాయిస్ ఘోస్ట్ 2019 ఏప్రిల్‌లో వేలం ద్వారా విక్రయించిన అత్యంత ఖరీదైన వాహనం. ఇది రూ. 1.33 కోట్లకు అమ్ముడైంది, ఇది ఇడి నిర్ణయించిన మూల ధర కంటే 10,000 రూపాయలు అధికంగా ఉంది.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

పోర్చే పనామెరా గతసారి వేలంలో రూ. 54 లక్షలు కాగా, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350 అమ్మకపు ధర రూ. 53.76 లక్షలు, దాని మూల ధర 37.8 లక్షలు కంటే రూ. 16 లక్షలు ఎక్కువ. అయినప్పటికీ, పోర్స్చే అమ్మకాన్ని ED ఆమోదించలేదు.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

ఇప్పుడు వేలం వేయడానికి రోల్స్ రాయిస్ 2010 మోడల్ సిద్ధంగా ఉంది. మరియు ఇది ఓడోమీటర్‌లో 24,000 కి.మీ. ప్రయాణించినట్లు తెలుస్తుంది. కానీ మంచి కండిషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. తెలుపు రంగులో ఉన్న పోర్స్చే పనామెరా కూడా మంచి కండిషన్ లో కనిపిస్తుంది.

ఆన్‌లైన్‌లో వేలం వేయనున్న నీరవ్ మోడీ కార్లు ఇవే

వేలం ద్వారా ఇడి మెహుల్ చోక్సీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ కారును రూ. 11.75 లక్షలకు విక్రయించింది. టయోటా ఇన్నోవా క్రిస్టాకు రూ. 18.06 లక్షల రూపాయల విన్నింగ్ బిడ్ లభించింది. దీని మూల ధర రూ .10.5 లక్షలు. వేలం జాబితాలో రెండు హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి మరియు రెండు వాహనాలు ఒక్కొక్కటి 2.7 లక్షల రూపాయల అతి తక్కువ ధరను పొందాయి.

Most Read Articles

English summary
Nirav Modi’s Porsche Panamera and Rolls Royce Ghost to be auctioned online. Read in Telugu.
Story first published: Saturday, February 22, 2020, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X