కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మంచి హైప్ తెచ్చుకున్న కియా సోనెట్‌కు పోటీగా ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది నిస్సాన్ ఇండియా. "నిస్సాన్ మాగ్నైట్" పేరుతో వస్తున్న ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశం వేదికగా అక్టోబర్ 21, 2020వ తేదీనన ప్రపంచానికి పరియచం చేయనున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ తమ నిస్సాన్ మాగ్నైట్‌ను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే ఈ మోడల్ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షించింది. నిస్సాన్ ప్రపంచ స్థాయి పరీక్షా కేంద్రం నిస్సాన్ తోచిగి ప్రూవింగ్ గ్రౌండ్‌లో కూడా నిస్సాన్ మాగ్నైట్ పరీక్షించారు. నిస్సాన్ నుండి పాపులర్ అయిన జిటి-ఆర్ మరియు అరియా మోడళ్లను కూడా ఇదే పరీక్షా కేంద్రంలో కంపెనీ పరీక్షించింది.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

ఈ విషయంపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జపాన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. నిస్సాన్ మాగ్నైట్ సబ్-4 మీటర్ విభాగంలో ఓ ధైర్యమైన ఉత్పత్తి మరియు ఇది బి-ఎస్‌యూవీ విభాగాన్ని పునర్నిర్వచించగలదని మేము విశ్వసిస్తున్నాము. ఈ గేమ్ ఛేంజింగ్ ఉత్పత్తిని భారతదేశానికి తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము" అని అన్నారు.

MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !

నిస్సాన్ మాగ్నైట్ టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. నిస్సాన్ విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ ప్రకారం, దీని ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ నుండి ప్రారంభమై ఫ్రంట్ బంపర్‌లో కలుస్తుంది.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లచో మరింత స్పోర్టీ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్రొఫైల్‌లో ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి.

MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

నిస్సాన్ ఇండియా విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ క్యాబిన్ చిత్రాలను చూస్తే, ఇందులో ప్రొడక్షన్‌కు సిద్ధమయ్యే వేరియంట్‌లో ఏవేమీ ఇంటీరియర్స్ ఫీచర్స్ ఆశించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చిత్రాల్లో ప్రధానంగా డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ స్పేస్‌ను హైలైట్ చేశారు.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హెక్సాగనల్ ఏసి వెంట్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంటీరియర్స్‌లో రెడ్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రీడౌట్‌తో కూడిన టెంపరేచర్ కంట్రోల్స్‌ని కూడా ఇందులో గమనించవచ్చు.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్‌ను హెచ్ఆర్10 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

నిస్సాన్ మాగ్నైట్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రెనాల్ట్ నుండి రానున్న కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కియా సోనెట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆరోజున వస్తోన్న 'నిస్సాన్ మాగ్నైట్'

నిస్సాన్ మాగ్నైట్ ప్రపంచ ఆవిష్కరణ తేదీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిస్సాన్ ఇండియా ఈ నెలలో తమ మాగ్నైట్ ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేయటం ద్వారా ఈ విభాగంలో తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తోంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఈ కొత్త మోడల్ నిస్సాన్ ఇండియాకు మంచి ప్రయోజనాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Nissan India has announced that it will unveil the Magnite compact-SUV on October 21, 2020. The company will be globally unveiling the Nissan Magnite via a virtual conference due to the ongoing pandemic in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X