టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేస్తున్న ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్'ను ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పుడు 'నిస్సాన్ మాగ్నైట్' కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు డ్రైవ్‌స్పార్క్ కెమెరాకు చిక్కాయి.

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

నిస్సాన్ మాగ్నైట్‌ను బెంగుళూరు శివార్లలో పరీక్షించడాన్ని మేము గుర్తించాము. చిత్రాలలో చూసినట్లుగా, పరీక్ష వాహనాన్ని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉంది. ఈ టెస్టింగ్ వాహనంలో అమర్చిన స్టీల్ వీల్స్‌ను చూస్తుంటే, ఇది బహుశా ఎంట్రీ లెవల్ వేరియంట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

ఈ సరికొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. ఇటీవలే నిస్సాన్ ఈ మోడల్‌కు సంబంధించి పూర్తి వాక్‌రౌండ్ వీడియోను పోస్ట్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ డిజైన్ మేనేజర్ తకుమి యోనియామా ఈ కొత్త కారులోని డిజైన్ ఫీచర్లను హైలైట్ చేస్తుండటాన్ని ఆ వీడియోలో మనం చూశాం.

MOST READ:మీకు తెలుసా.. ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 13.2 లక్షలు.. ఎందుకంటే ?

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

డిజైనర్ పేర్కొన్న వివరాల ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. నిస్సాన్ విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ ప్రకారం, దీని ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ నుండి ప్రారంభమై ఫ్రంట్ బంపర్‌లో కలుస్తుంది.

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లచో మరింత స్పోర్టీ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్రొఫైల్‌లో ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న మహిళా పోలీస్.. బైక్ కొనడానికి కారణం అడిగితే ఏం చెప్పిందో తెలుసా ?

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

నిస్సాన్ ఇండియా విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ క్యాబిన్ చిత్రాలను చూస్తే, ఇందులో ప్రొడక్షన్‌కు సిద్ధమయ్యే వేరియంట్‌లో ఏవేమీ ఇంటీరియర్స్ ఫీచర్స్ ఆశించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చిత్రాల్లో ప్రధానంగా డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ స్పేస్‌ను హైలైట్ చేశారు.

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హెక్సాగనల్ ఏసి వెంట్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంటీరియర్స్‌లో రెడ్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రీడౌట్‌తో కూడిన టెంపరేచర్ కంట్రోల్స్‌ని కూడా ఇందులో గమనించవచ్చు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 ధర పెంపు: కొత్త ప్రైస్ లిస్ట్

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్‌ను హెచ్ఆర్10 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:కొత్త ఫీచర్లతో విడుదల కానున్న హమ్మర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (టీజర్ వీడియో)

టెస్టింగ్ దశలో నిస్సాన్ మాగ్నైట్: స్పై చిత్రాలు, కొత్త వివరాలు వెల్లడి!

కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిస్సాన్ మాగ్నైట్ టెస్టింగ్ వాహనాన్ని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉండటం వలన ఇందులోని డిజైన్ వివరాలు పూర్తిగా తెలియరాలేదు. అయితే, ఇది నిస్సాన్ ఇటీవల ఆవిష్కరించిన కాన్సెప్ట్ వాహనానికి మరియు ప్రొడక్షన్ వెర్షన్‌కు చాలా సమీప పోలికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, రాబోయే కియా సోనెట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Nissan is gearing up to launch a new compact SUV called the Magnite in the Indian market. The company has decided to enter the new segment and cater to the growing demand of the compact SUVs. The Nissan Magnite is expected to arrive sometime early next year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X