నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

భారత్‌లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ ఇండియా నుండి రానున్న సరికొత్త మోడల్ "నిస్సాన్ మాగ్నైట్"ను కంపెనీ అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త మాగ్నైట్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

భారతదేశం వేదికగా, నిస్సాన్ ఇండియా దేశీయంగా అభివృద్ధి చేసిన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మరో రెండు రోజుల్లో ప్రపంచానికి పరియచం చేయనుంది. భారత్‌లో అభివృద్ధి చేయబడిన ఈ కారును వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించనున్నారు. నిస్సాన్ ఇండియా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొత్త మాగ్నైట్ టీజర్ వీడియోని రిలీజ్ చేసింది.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

నిస్సాన్ ఇండియా #ఇగ్నైట్‌యువర్‌కరిష్మా అనే ట్యాగ్‌లైన్‌తో ఓ క్యాంపైన్‌ను కూడా ప్రారంభించింది. మాగ్నైట్ బయటి నుంచి బోల్డ్‌గా లోపలి నుండి అందంగా కనిపిస్తుందంటూ కంపెనీ ప్రచారం చేస్తోంది. ఈ టీజర్ వీడియోకి ముందే, ప్రపంచ స్థాయి పరీక్షా కేంద్రమైన నిస్సాన్ తోచిగి ప్రూవింగ్ గ్రౌండ్‌లో నిస్సాన్ మాగ్నైట్ వీడియోని చిత్రాలను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇదే ట్రాక్‌పై నిస్సాన్ నుండి పాపులర్ అయిన జిటి-ఆర్ మరియు అరియా మోడళ్లను కూడా పరీక్షించారు.

MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

నిస్సాన్ మాగ్నైట్ టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. నిస్సాన్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం, ఇందులో ముందు వైపు పెద్ద హమీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు సిల్వర్ కలర్‌లో ఫినిష్ చేసిన స్కఫ్ ప్లేట్స్ ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

ఈ ఎస్‌యూవీ చుట్టూరా క్రింది భాగంలో అమర్చిన బ్లాక్ కలర్ బాడీ క్లాడింగ్, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బ్లాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మహీంద్రా థార్ బుకింగ్స్ అదుర్స్.. కేవలం 17 రోజుల్లోనే 15,000 యూనిట్లు బుక్..

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

ఇంకా ఇందులో ఎల్‌ఈడి స్ప్లిట్ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్, విండో చుట్టూ సిల్వర్ లైన్స్ మరియు బ్లాక్ కలర్‌లో పెయింట్ చేసిన రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హెక్సాగనల్ ఏసి వెంట్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంటీరియర్స్‌లో రెడ్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రీడౌట్‌తో కూడిన టెంపరేచర్ కంట్రోల్స్‌ని కూడా ఇందులో గమనించవచ్చు.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

నిస్సాన్ మాగ్నైట్ టాప్-ఎండ్ వేరియంట్లలో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేస్తున్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్‌ను హెచ్ఆర్10 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 95 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:మతిపోగొడుతున్న మోడిఫైడ్ హిందూస్తాన్ అంబాసిడర్

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

నిస్సాన్ మాగ్నైట్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రెనాల్ట్ నుండి రానున్న కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ టీజర్ లాంచ్; అక్టోబర్ 21, 2020వ తేదీన ఆవిష్కరణ

నిస్సాన్ మాగ్నైట్ టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో నిస్సాన్ మాగ్నైట్ కూడా ఒకటి. కాన్సెప్ట్ దశ నుంచే ఈ వాహనంపై భారత్‌తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి హైప్ నెలకొంది. దేశీయ మార్కెట్లో మాగ్నైట్ విడుదలతో నిస్సాన్ ఇండియా భారీ అమ్మకాలను సాధించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The upcoming Nissan Magnite has been teased ahead of its global unveil on October 21, 2020. The company is expected to launch the Magnite SUV sometime by the end of this year after its global unveil. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X