నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

నిస్సాన్ మ్యాగ్నైట్ డిసెంబర్ 2 న భారతదేశంలో విడుదల కానుంది, ఈ కొత్త మోడల్ చాలా ఫీచర్లు మరియు పరికరాలను, కొత్త ఇంజన్లతో సహా చాలా కొత్త ఫీచర్లతో రానుంది. మనం ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ యొక్క టాప్ 5 ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

డిజైన్ :

నిస్సాన్ మ్యాగ్నైట్ మొదటి చూపులో ఖచ్చితంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ చుట్టుపక్కల షార్ప్ లైన్స్ మరియు క్రీజులతో చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ చుట్టూ బ్లాక్-క్లాడింగ్స్ కలిగి ఉంది. మ్యాగ్నైట్ మంచి లైటింగ్ సెటప్ కలిగి ఉంటుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ ఇండికేటర్‌తో బ్లాక్-అవుట్ ఓఆర్‌విఎం ఉంటుంది. అంతేకాకుండా, ఓఆర్‌విఎంలలో కెమెరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది సెగ్మెంట్-ఫస్ట్ 360-డిగ్రీ కెమెరా ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఈ కారు యొక్క లోగో క్రింద మధ్యలో బోల్డ్ ‘మ్యాగ్నైట్' బ్యాడ్జింగ్ పొందుతుంది.

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

ఇంటీరియర్స్ :

మ్యాగ్నైట్ ఎస్‌యూవీ లోపల విశాలమైన క్యాబిన్‌ ఉంటుంది. డాష్‌బోర్డ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. స్టీరింగ్ వీల్ లెదర్ తో కప్పబడి ఉంటుంది మరియు ఇరువైపులా కంట్రోల్స్ కలిగి ఉంటుంది. సీట్లు అన్నీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇందులో సన్‌రూఫ్ లేదు. ఇది 336-లీటర్ బూట్ స్పెస్ కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త కనెక్టెడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టిన హీరో మోటోకార్ప్ : ధర, వివరాలు & ఉపయోగాలు

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ :

కారు యొక్క మెయిన్ హైలెట్స్ లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి . ఇది 7 ఇంచెస్ ఎమ్ఐడి స్క్రీన్ కలిగి ఉన్న డిజిటల్. ఇది వాహనదారునికి కారు గురించి ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది.

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

ఇన్ఫోటైన్మెంట్ సిస్టం :

మ్యాగ్నైట్ ఎస్‌యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉన్న 8-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. టచ్‌స్క్రీన్ సున్నితంగా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు దిగువన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. స్టార్ట్ / స్టాప్ బటన్ AC కంట్రోల్స్ క్రింద ఉంచబడుతుంది. ఈ కారులో కొన్ని ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి.

MOST READ:కొత్త యాప్ లాంచ్ చేసిన టివిఎస్ ; దీని ఉపయోగం ఏంటో మీకు తెలుసా ?

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

ఇంజిన్ :

మ్యాగ్నైట్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ కలిగి ఉంది. ఇది 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ మ్యాగ్నైట్‌లోని టాప్ 5 ఫీచర్స్, ఇవే.. చూసారా !

నిస్సాన్ మాగ్నైట్ డిసెంబర్ 2 న భారతదేశంలో విడుదల కానుంది. నిస్సాన్ మాగ్నైట్ యొక్క బుకింగ్ అన్ని డీలర్‌షిప్‌లలో అధికారికంగా ప్రారంభించబడింది, దీనిని XE (బేస్), XL (మిడ్), XV (హై) మరియు XV (ప్రీమియం) వేరియంట్‌లకు తీసుకువచ్చింది. ఇది మొత్తం రెండు ఇంజన్లు మరియు మూడు గేర్‌బాక్స్‌లతో పాటు అప్సనల్ యాక్ససరీస్ ప్యాక్‌తో వస్తుంది.

MOST READ:కొత్త 2021 ఇన్నోవా క్రిస్టా vs పాత ఇన్నోవా క్రిస్టా: రెండింటిలో ఏది బెస్ట్?

Most Read Articles

English summary
Nissan Magnite Top 5 Things To Know. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X