Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 5 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 7 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాగ్నైట్ లాంచ్ కంటే ముందుగా నిస్సాన్ సర్వీస్ హబ్ ప్రారంభం
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ఇండియా తమ వినియోగదారులకు ఇబ్బంది లేని మరియు మెరుగైన యాజమాన్య అనుభవాన్ని అందించడానికి దేశంలో కొత్త ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. 'నిస్సాన్ సర్వీస్ హబ్' అని పిలిచేవబడే ఈ సర్వీస్ సాయంతో కస్టమర్లు ఆన్లైన్లోనే సర్వీస్ అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చు.

నిస్సాన్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ 'మాగ్నైట్' వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో, కంపెనీ నిస్సాన్ సర్వీస్ హబ్‌ను వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త సర్వీస్ హబ్ ఇప్పటికే ఉన్న మరియు కొత్త నిస్సాన్ కస్టమర్లకు ఆందోళన లేని మరియు అనుకూలమైన వెహికల్ మెయింటినెన్స్ కోసం భరోసాని అందిస్తుంది.

భారతదేశంలో నిస్సాన్ కార్లను సర్వీస్ చేయటానికి నిస్సాన్ సర్వీస్ హబ్ 4-సులభమైన దశలుగా విభజించబడింది. మొదటి దశలో సర్వీస్ ఖర్చు ఉంటుంది, ఇక్కడ కస్టమర్ వారి వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత, కస్టమర్‌కు సర్వీస్‌కు అయ్యే ఖర్చు అంచనా మొత్తాన్ని తెలియజేటం జరుగుతుంది.
MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 ఎమ్ కాంపిటీషన్ : ధర & వివరాలు

రెండవ దశలో కస్టమర్ బ్రాండ్ వెబ్సైట్లో ఆన్లైన్లో సర్వీస్ రిక్వెస్ట్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా అదే రకమైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ దశలో కస్టమర్‌కు సమీపంలో ఉన్న అధీకృత వర్క్‌షాప్‌ల లభ్యత మరియు టైమ్ స్లాట్ వివరాలను తెలుసుకోవచ్చు.

నిస్సాన్ సర్వీస్ హబ్ ప్రక్రియలో మూడవ దశ డీలర్షిప్ ద్వారా పూర్తవుతుంది. సర్వీస్ స్లాట్ బుక్ అయిన తర్వాత, సంబంధిత డీలర్షిప్ లేదా వర్క్‌షాప్ ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించి, వాహనం గురించి ఏదైనా అదనపు వివరాలు అవసరమైతే సదరు డీలర్షిప్ కస్టమర్ నుండి తెలుసుకుంటుంది. ఇందులో కస్టమర్ లొకేషన్ కూడా ఉంటుంది.
MOST READ:నుజ్జు నుజ్జయిన 25 కోట్ల విలువైన పగని కార్.. ఎలాగో తెలుసా

ఈ ప్రక్రియలో నాల్గవది మరియు చివరి దశలో భాగంగా, కస్టమర్ యొక్క కారును సర్వీస్ కోసం సదరు కస్టమర్ తెలిపిన ప్రాంతం నుండి సర్వీస్ కోసం పిక్ చేసుకోవటం జరుగుతుంది. ఇలా పిక్ చేసుకున్న వాహనం సర్వీస్ పూర్తయిన తర్వాత, ఆ వాహనం మళ్లీ అదే ప్రదేశంలో డ్రాప్ చేయటం జరుగుతుంది. నిస్సాన్ సర్వీస్ హబ్ సాయంతో కస్టమర్లు వారి ఇంటి వద్ద నుండే సౌకర్యంగా తమ వాహన సర్వీస్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో కంపెనీ అందించిన భద్రతా మార్గదర్శకాలను నిస్సాన్ డీలర్‌షిప్‌లు మరియు వర్క్‌షాప్‌లు తప్పనిసరిగా అనుసరిస్తాయి. వాహనాన్ని వినియోగదారునికి అప్పగించే ముందు దానిని పూర్తిగా శుభ్రపరుస్తారు. కస్టమర్లు కంపెనీ అందించే వివిధ రకాల ఆన్లైన్ చెల్లింపు ఆప్షన్లను ఎంచుకొని సర్వీస్ కోసం చెల్లింపులు చేయవచ్చు.
MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

నిస్సాన్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీ మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభం కాగా, మాగ్నైట్‌ను డిసెంబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

నిస్సాన్ సర్వీస్ హబ్ ప్రారంభంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
నిస్సాన్ ఇండియా తమ వినియోగదారులకు దేశంలో ఇబ్బంది లేని మరియు సౌకర్యవంతమైన వెహికల్ మెయింటినెన్స్ అనుభవాన్ని అందించడానికి కొత్త ఆఫ్టర్ సర్వీస్ సేల్‌ను ప్రవేశపెట్టింది. నిస్సాన్ సర్వీస్ హబ్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ మరియు కాంటాక్ట్‌లెస్ ప్రక్రియ, ఇది దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమ వినియోగదారుల భద్రతను నిర్ధారిస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు