Just In
- 41 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- 17 hrs ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
Don't Miss
- News
ఒక కూతురి కోసం రూ.10 వేలకు మరో కూతురి అమ్మకం కథ ... ఏపీలో మనసును పిండేసిన వ్యధ
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Sports
'అనుకోకుండా క్రికెటర్ అయ్యా.. టీమిండియా జెర్సీ ధరిస్తానని అసలు ఊహించలేదు'
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిస్సాన్ కి కష్ట కాలం : నిలిపివేయబడిన టెర్రానో ఎస్‌యువి
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నిస్సాన్ ఇండియా తన బ్రాండ్ అయిన టెర్రానో ఎస్‌యువిని నిలిపివేసింది. నిస్సాన్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ నుండి టెర్రానో ఎస్‌యువి పేరును తొలగించింది. నిస్సాన్ టెర్రానో ఎస్‌యువిని నిలిపివేయడానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం.

నిస్సాన్ తన టెర్రానో ఎస్‌యువిని బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించలేదు. కానీ భవిష్యత్తులో భారత మార్కెట్లో కొత్త నిస్సాన్ టెరానోను విడుదల చేసే సమాచారం కూడా లేదు. అంతే కాకుండా భారత మార్కెట్లో ఇటీవల టెర్రానో ఎస్‌యువికి డిమాండ్ తక్కువగా ఉంది. నిస్సాన్ టెరానో అమ్మకాలు బాగా పడిపోయాయి.

నిస్సాన్ తన టెర్రానో ఎస్‌యువిని భారత మార్కెట్లో నిలిపివేసింది. నిస్సాన్ టెర్రానో ఎస్‌యువిని తొలిసారిగా 2013 లో భారత మార్కెట్లో విడుదల చేశారు. నిస్సాన్ టెర్రానో భారత మార్కెట్లో తన ప్రత్యర్థులతో పోటీ పడలేకపోయింది. ఈ ఎస్‌యూవీలో ముఖ్యమైన నవీకరణను చేసి విడుదల చేయడంలో విఫలమైంది.
MOST READ:నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి

నిస్సాన్ టెర్రానో ఎస్‌యువి కొత్త నవీకరణలతో లాంచ్ చేయబడింది. అంతే కాకుండా మార్కెట్లో వినియోగదారులను ఎక్కువగా ఆకర్శించగలదు. కానీ బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయలేకపోవడం వల్ల నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీని నిలిపివేసినప్పటి నుండి నిస్సాన్ కిక్స్ మాత్రమే ఈ బ్రాండ్ ఎస్‌యువిగా ఉంది.

నిస్సాన్ టెర్రానోకు పెట్రోల్ మరియు డీజిల్ ఎంపిక ఉండేది. నిస్సాన్ టెర్రానోలో 1.6 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 103 బిహెచ్‌పి మరియు 148 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:లాక్‌డౌన్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో పట్టుబడ్డ యువకుడు, చివరికి ఏమైందంటే ?

ఈ నిస్సాన్ టెర్రానోలో రెండు డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఒక డీజిల్ ఇంజన్ 84 బిహెచ్‌పి మరియు 148 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, మరొక డీజిల్ ఇంజన్ 109 బిహెచ్‌పి మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తాయి.

నిస్సాన్ తన బిఎస్ 6 కిక్స్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ కొత్త నిస్సాన్ కిక్స్ మోడల్ భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. కొత్త నిస్సాన్ కిక్స్‌లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.
MOST READ:గొప్ప మనసును చాటుకున్న హీరో అజిత్, ఇంతకీ ఏం చేసాడో తెలుసా ?

నిస్సాన్ టెర్రానో అమ్మకాలు తక్కువగా ఉన్నందున నిస్సాన్ తన టెర్రానో ఎస్‌యువిని భారత మార్కెట్లో నిలిపివేసింది. నిస్సాన్ టెర్రానో ఎస్‌యువి భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎస్‌యువిలకు ప్రత్యర్థిగా ఉంటుంది.