Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డాట్సన్ కార్లపై నవంబర్ ఆఫర్లు; మోడల్ వారీ డిస్కౌంట్ వివరాలు
నిస్సాన్‌కి చెందిన చవక కార్ బ్రాండ్ డాట్సన్, నవంబర్ నెల ఆఫర్లలో భాగంగా తమ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. భారతదేశంలో డాట్సన్ అందిస్తున్న అన్ని రకాల మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం డాట్సన్‌కు రెడిగో, గో, గో ప్లస్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి.

డాట్సన్ ఈ మూడు మోడళ్లపై నవంబర్ 2020 నెలలో గరిష్టంగా 51,00 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ప్రారంభ బుకింగ్ ప్రయోజనం అందుబాటులో ఉన్నాయి మరియు ఇవి కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఆఫర్లు నవంబర్ 1 నుండి నవంబర్ 30, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ డాట్సన్ రెడి-గోపై కంపెనీ గరిష్టంగా రూ.38,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.7,000 నగదు బోనస్‌తో పాటు రూ.11,000 వరకు ఇయర్-ఎండ్ బోనస్ మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:క్రాష్ టెస్ట్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మహీంద్రా థార్ : వివరాలు

దేశంలో ఎంపిక చేసిన వారికి (పిల్లర్స్ ఆఫ్ ఇండియా మరియు మెడికల్ ప్రొఫెషనల్) కంపెనీ రూ.5,000 కార్పొరేట్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. మార్కెట్లో డాట్సన్ రెడి-గో ధరలు రూ.2.83 లక్షల నుండి రూ.4.77 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉన్నాయి.

డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే, ఈ మోడల్‌పై నవంబర్ నెలలో 51,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. డాట్సన్ గో మోడల్‌పై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో రూ.20,000 నగదు బోనస్‌తో పాటు రూ.11,000 వరకు ఇయర్-ఎండ్ బోనస్ మరియు పాత కారును ఎక్సేంజ్ చేసేటప్పుడు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

మార్కెట్లో డాట్సన్ గో ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.6.45 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. కాగా, ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.6.25 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. డాట్సన్ గో భారతదేశంలో సివిటి ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్న అత్యంత చౌకైన కారు.

ఇకపోతే, కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్షిప్ మోడల్ మరియు కాంపాక్ట్ ఎమ్‌పివి డాట్సన్ గో ప్లస్‌పై కంపెనీ ఈ నవంబర్ ఆఫర్లలో భాగంగా, దీనిపై గరిష్టంగా 46,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు బోనస్‌తో పాటుగా రూ.11,000 వరకు ఇయర్ ఎండ్ బోనస్ మరియు రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి.
MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి ధరలు రూ.4.19 లక్షల నుంచి రూ.6.89 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ కాంపాక్ట్ ఎమ్‌పివి మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.40,000 మాత్రమే.

డాట్సన్ కార్ల డిస్కౌంట్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్లో విక్రయించే అన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. తాజా డిస్కౌంట్లతో భారతదేశంలో విక్రయించే చౌకైన సివిటి మోడల్ ఇప్పుడు 51,000 రూపాయల బెనిఫిట్స్ తర్వాత మరింత సరసమైనదిగా నిలుస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా దేశంలో మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:KLX 300 డ్యూయల్ స్పోర్ట్ బైక్ ఆవిష్కరించిన కవాసకి ; పూర్తి వివరాలు