టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

ప్రస్తుతం దేశంలో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఈ పండుగ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే అనేక కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కూడా భారత్‌లో విక్రయిస్తున్న గ్లాంజా, యారిస్ మరియు ఇన్నోవా క్రిస్టా మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

ఈ అక్టోబర్ 2020 నెలలో టొయోటా కారును కొనుగోలు చేసే కస్టమర్లు వారు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి రూ.65,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. మోడల్ వారీగా టొయోటా అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా గ్లాంజా

టొయోటా ఇండియా పోర్ట్‌ఫోలియోలో లభిస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా మోడల్‌పై కంపెనీ అక్టోబర్ 2020 నెల ఆఫర్లలో భాగంగా మొత్తం రూ.30,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

MOST READ:టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా యారిస్

టొయోటా తమ యారిస్ సెడాన్‌ను మొట్టమొదటిసారి 2018లో భారత మార్కెట్లో విడుదలైంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ఈ కారుపై భారీగా రూ.60,000 విలువైన ఆఫర్లను అందిస్తోంది.

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా యారిస్‌పై రూ.20,000 వరకు నగదు తగ్గింపును అందిస్తున్నారు. అంతే కాకుండా, ఈ కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.20,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా మరో ట్వీట్‌.. ఇప్పుడు ఈ ట్వీట్‌‌లో ఏం పోస్ట్ చేసాడో తెలుసా ?

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా ఇన్నోవా క్రిస్టా

ఇకపోతే, టొయోటా ప్రోడక్ట్ లైనప్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పివి ఇన్నోవా క్రిస్టాపై కంపెనీ గరిష్టంగా రూ.65,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.20,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

పైన పేర్కొన్న ఆఫర్లే కాకుండా, జీతం తీసుకునే ఉద్యోగుల కోసం కూడా టొయోటా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసినదే. టొయోటా ప్రకటించిన ఈ ‘స్పెషల్ ఆఫర్లు' సంభావ్య కస్టమర్లకు సులభంగా కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆప్షన్లు లభిస్తాయి.

MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

ఈ ఫైనాన్స్ ఆఫర్ల సాయంతో కస్టమర్లు తమ డ్రీమ్ టొయోటా కారును సొంతం చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. అదనంగా, ఈ పథకాన్ని ఎంచుకునే ఆసక్తి గల కస్టమర్లు టొయోటా యొక్క ప్రత్యేకమైన 3 నెలల ఈఎమ్ఐ హాలిడే ఆఫర్‌ను కూడా పొందగలరు. అంటే, లోనులో కారు కొన్న వారు మొదటి మూడు నెలల పాటు ఈఎమ్ఐని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

అంతేకాకుండా, ఇటీవల ప్రకటించిన ప్రభుత్వ నగదు ప్యాకేజీ పథకంలో, ఉద్యోగులు ఎల్‌టిసి / ఎల్‌టిఏకు సమానమైన నగదు రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది లీవ్ ఎన్‌కాష్మెంట్ లేదా ఎల్‌టిఏ / ఎల్‌టిసి ఛార్జీలను కలిగి ఉంటుంది మరియు ఇది ఎల్‌టిసి / ఎల్‌టిఏకు అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకారం పన్ను రహితంగా కూడా ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

టొయోటా కార్లపై ఫెస్టివ్ ఆఫర్స్; రూ.65,000 వరకూ డిస్కౌంట్స్!

టొయోటా అక్టోబర్ ఫెస్టివ్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లోని ఇతర కార్ కంపెనీల మాదిరిగానే టొయోటా కూడా ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల జాబితాలో కంపెనీ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చేర్చలేదు. ఈ మోడల్‌పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వటం లేదు, అయితే దీనిపై డీలర్‌స్థాయి ఆఫర్లు లభించవచ్చు.

Most Read Articles

English summary
Toyota October 2020 Discount Offers For Glanza Yaris Innova Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X