త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

పండుగ సీజన్‌లో బెస్ట్ డీల్‌లో హోండా కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ ఈ అక్టోబర్ నెలలో ఆకర్షనీయమైన ఆఫర్లను అందిస్తోంది. తాజా ఆఫర్లలో నగదు తగ్గింపులు, మార్పిడి ప్రయోజనాలు మరియు బ్రాండ్ యొక్క లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లలో లభించే ఇతర ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా బ్రాండ్ లైనప్‌లోని అమేజ్, ఐదవ-తరం హోండా సిటీ, డబ్ల్యూఆర్-వి, జాజ్ మరియు సివిక్ మోడళ్లపై కంపెనీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్ ఎంచుకున్న మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 30, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి:

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా అమేజ్

భారత మార్కెట్లో హోండా నుంచి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ హోండా అమేజ్‌లో పెట్రోల్ మోడల్‌పై రూ.47,000 మరియు డీజిల్ మోడల్‌పై రూ.37,000 వరకు లాభాలను అందిస్తోంది. కొత్త అమేజ్ కోసం తమ పాత కారును మార్పిడి (ఎక్సేంజ్) చేసుకోవాలని చూస్తున్న వినియోగదారులకు కంపెనీ రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

MOST READ:ప్రధాని మోదీ ఉపయోగించనున్న లేటెస్ట్ ప్లైట్ ఇదే.. చూసారా !

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

వీటికి అదనంగా, కస్టమర్లు నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి గాను రూ.12,000 విలువైన పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీ ప్యాకేజీని కూడా పొందుతారు. ఈ మోడళ్లలో డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్లపై కంపెనీ వరుసగా రూ.10,000, రూ.20,000 నగదు తగ్గింపును కూడా అందిస్తోంది.

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా జాజ్

హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌పై కంపెనీ అక్టోబర్ 2020 నెలలో గరిష్టంగా రూ.40,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు బోనస్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో 2020 హోండా జాజ్ ధరలు రూ.7.49 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

MOST READ:ఇది చూసారా.. బామ్మకోసం 4 దేశాలు కాలినడకతో ప్రయాణించిన 10 ఏళ్ల బాలుడు

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

ఐదవ తరం హోండా సిటీ

హోండా కార్స్ ఇండియా, ఇటీవలే విడుదల చేసిన తమ సరికొత్త ఐదవ తరం సిటీ సెడాన్‌పై కేవలం ఎక్సేంజ్ బోనస్ ఆఫర్‌ను మాత్రమే అందిస్తోంది. ఈ కొత్త కారు కోసం తమ పాత కారును ఎక్సేంజ్ కస్టమర్లు కంపెనీ అదనంగా రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంద. మార్కెట్లో కొత్త ఐదవ తరం హోండా సిటీ ధరలు రూ.10.89 లక్షల నుండి రూ.12.39 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా డబ్ల్యుఆర్-వి

హోండా అందిస్తున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ డబ్ల్యుఆర్-వి మోడల్‌లో కంపెనీ ఇటీవలే బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది.

MOST READ:సర్వీస్ సెంటర్ నుంచి దొంగలించబడిన టయోటా ఇన్నోవా క్రిస్టా.. ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా డబ్ల్యుఆర్-విలోని అన్ని వేరియంట్లపై కంపెనీ రూ.25,000 నగదు తగ్గింపును అందిస్తోంది. దీనికి అదనంగా, ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తున్నారు. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధరలు రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమై రూ.10.99 లక్షల వరకు ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా సివిక్

హోండా సివిక్‌లో కూడా కంపెనీ ఇటీవలే కొత్తగా బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెట్టింది. హోండా సివిక్ డీజిల్ మోడల్‌పై కంపెనీ గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది. డీజిల్ వేరియంట్ సివిక్‌పై హోండా రూ.2.5 లక్షల వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. పెట్రోల్‌తో నడిచే మోడల్‌ను లక్ష రూపాయల వరకు నగదు తగ్గింపుతో అందిస్తున్నారు.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా ?

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

కాగా.. అక్టోబర్ నెల ఆఫర్ల నుండి పాత తరం (నాల్గవ తరం) హోండా సిటీ మరియు హోండా ఫ్లాగ్‌షిప్ మోడల్ సిఆర్-వి మోడళ్లు మినహాయించబడ్డాయి. ఈ నెలలో ఇవి డిస్కౌంట్ ఆఫర్లను కోల్పోతాయి. అయితే, వీటిపై కొన్ని డీలర్ స్థాయి ఆఫర్లు ఉండే అవకాశం ఉంది.

త్వరపడండి.. హోండా కార్లపై ఆకర్షనీయమైన ఆక్టోబర్ నెల ఆఫర్లు!

హోండా కార్లలో అక్టోబర్ నెల ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పండుగ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు హోండా ఈ నెలలో తమ వాహనాలపై అద్భుతమైన డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను అందిస్తోంది. దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్లో అమ్మకాలను పెంచుకోవడానికి ఇది బ్రాండ్‌కు సహాయపడుతుంది. హోండా సివిక్ డీజిల్ వేరియంట్లపై అక్టోబర్ నెలలో గరిష్టంగా రూ.2.5 లక్షల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

Most Read Articles

English summary
Honda Cars India is offering attractive benefits during the ongoing festive season in India. The latest offers include cash discounts, exchange benefits and other special packages available on select models in the brand's line-up. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X