Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓలా క్యాబ్ లో ప్రయాణించాలా, అయితే ఇవి తప్పకుండా పాటించాల్సిందే
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ఇప్పుడు మొదటి మరియు రెండవ దశలు పూర్తి చేసుకుని ఇప్పుడు మూడవ దశలో అడుగుపెట్టింది. ఈ మూడవదశలో అన్ని రాష్ట్రాలలోని ప్రాంతాలను గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లగా విభాగించారు. అంతే కాకుండా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు అనుమతులను జరీ చేసింది.

ఓలా క్యాబ్స్ భారతదేశంలో తమ కార్యకలాపాల పునఃప్రారంభించింది. యాప్-బేస్డ్ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫాం ఆధారంగా దేశవ్యాప్తంగా 100 కి పైగా నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సేవలు కేవలం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలోని కొన్ని మండలాల్లో లాక్డౌన్ పరిమితులను సడలించడానికి అనుమతించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం తమ కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
MOST READ:లాక్డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?

ఓలా క్యాబ్స్ కార్యకలాపాల యొక్క పునఃప్రారంభం గురించి మాట్లాడుతూ, కంపెనీ '10 -స్టెప్స్ టు సేఫ్ రైడ్ 'అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పద్ధతి కరోనా నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇది వినియోగదారులు మరియు డ్రైవర్ భాగస్వాముల భద్రతను నిర్ధారిస్తుంది.

డ్రైవర్ మరియు కస్టమర్ల కు చాలా భద్రతను కల్పిస్తుంది. అంతే కాకుండా డ్రైవర్లు మరియు వినియోగదారులు రెడ్ జోన్లలోకి ప్రవేశించకుండా చర్యలను కూడా తీసుకుంటుంది. ప్రతి రైడ్ తర్వాత కార్లు శుభ్రపరచబడతాయి. ఇది వినియోగదారుల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటుంది.
MOST READ:ఆకాశంలోకి ఎగరటానికి ట్రై చేసిన హీరో అక్షయ్ కుమార్ [వీడియో]

ఓలా డ్రైవర్లు మరియు కస్టమర్లు సామాజిక దూరం పాటించడమే కాకుండా, శానిటైజేషన్ చర్యలు మరియు వ్యక్తిగత పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.

కస్టమర్ మరియు డ్రైవర్లు అనుసరించడానికి కంపెనీ ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేసింది.
డ్రైవర్ - పార్ట్నర్ కోసం :
1) రెడ్ జోన్లో ప్రయాణం నిషేధం
2) తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ఉపయోగించడం
3) వాహనంలోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచడం
4) క్రమం తప్పకుండా కార్లను శుభ్రం చేయడం
5) ఫ్లెక్సిబుల్ క్యాన్సిలేషన్
MOST READ:నిస్సాన్ కి కష్ట కాలం : నిలిపివేయబడిన టెర్రానో ఎస్యువి

వినియోగదారుల కోసం :
1) తప్పనిసరిగా మాస్క్ ధరించడం
2) ఎసి స్విచ్ ఆఫ్ చేయడం
3) కారులో ఇద్దరే ప్రయాణించాలి
4) కస్టమర్లచే సామాను లోడ్ చేసి అన్లోడ్ చేయించడం
5) కాష్ లెస్ పేమెంట్

ఓలా ప్రతినిధి మరియు కమ్యూనికేషన్స్ హెడ్ ఆనంద్ సుబ్రమణియన్ మాటాడుతూ, "సురక్షితమైన ప్రయాణానికి ఈ విధానాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ విధంగా పాటించడం వాళ్ళ కరోనని కొంతవరకు కట్టడి చేయవచ్చు.అందరూ కలిసి ఈ విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల అవసరమైన నివారణ చర్యలు మంచి ఫలితాలకు దారి తీస్తాయి.
MOST READ:నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి