Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైద్య సదుపాయాల కోసం 500 క్యాబ్‌లను అందిస్తున్న ఓలా , ఎక్కడో తెలుసా..!
కరోనా వైరాస్ వ్యాప్తివల్ల భారతదేశం మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ లో ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా రవాణా సదుపాయాలన్నీ నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో విమానాలు, ట్రైన్లు మొదలైన వాటి సేవలు కూడా ఇప్పుడు పూర్తిగా నిలిపేయబడింది. ఈ విధంగా రవాణా సేవలు నిలిపివేయడం వల్ల అత్యవసర సమయంలో రోగులకు సహాయం చేయడానికి ఓలా 500 క్యాబ్‌లను ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.

500 ఓలా క్యాబ్‌లు కర్ణాటకలోని వివిధ జిల్లాలలో ఆరోగ్య కార్యకర్తల కొరకు, మందుల రవాణా కొరకు మరియు ఇతర అవసరమైన ఆరోగ్య పరికరాలను తీసుకెళ్లడానికి ఉపయోగించబడతాయి.

కరోనా వైరస్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడం కోసం, వైద్యులను రవాణా చేయడానికి ఓలా క్యాబ్స్ తన 500 వాహనాలను కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన 'డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్' దీనిని గురించి ట్వీట్లో తెలిపారు.

ఓలా యొక్క సేవలు బెంగళూరు, మైసూర్, మంగుళూరు, హుబ్లి ధార్వాడ్ మరియు బెలగావి జిల్లాల్లో లభిస్తాయి, అంతే కాకుండా బట్టి ప్రభుత్వం ఈ ప్రాంతాలలో క్యాబ్‌లను వినియోగించబడుతుందని తెలిపారు. క్యాబ్‌లు ఆరోగ్య సంరక్షణ కార్మికులను, రవాణా మందులను మరియు ఇతర అవసరమైన ఆరోగ్య పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగించబడతాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా క్యాబ్‌లు ఉపయోగించబడతాయి.

ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఓలా క్యాబ్స్ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. లాక్ డౌన్ ముగిసే వరకు ఓలా ఎటువంటి సేవలను నిర్వహించదు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా వైద్య సేవలకు ఉపయోగించడానికి మాత్రమే ఇప్పుడు ఇవి ఉపయోగించబడతాయని ప్రకటించారు.

కొరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో ఇప్పటివరకు 29 మందికి పైగా మరణించినట్లు నివేదికలు ధ్రువీకరించాయి. అంతే కాకుండా 1070 మందికి పైగా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీని ఫలితంగానే దేశం లాక్ డౌన్ లో ఉంచబడింది.

ఈ లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నందున సామూహిక బహిష్కరణకు గురయ్యారు. ఈ కార్మికులకు ఆహారం, ఆశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సదుపాయాలు కల్పిస్తున్నాయి.
MOST READ:క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన న్యూ హోండా సిటీ

వలస కార్మికులకు గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) కూడా ఇదే రీతిగాఉపయోగించబడుతుంది. ఆటో మొబైల్ తయారీ సంస్థలు కూడా మాస్క్ లు, గ్లౌజ్ లు మరియు వెంటిలేటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేస్తున్నారు.
MOST READ:లాక్ డౌన్ ఉన్నప్పటికీ తండ్రి కర్మ క్రియలకు వెళ్లిన వ్యక్తి, ఎలా వెళ్లాడంటే.. ?

ఏది ఏమైనా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓలా 500 క్యాబ్‌లను వైద్య సేవలకు ఉపయోగించడం అనేది హర్షించదగ్గ విషయం. ఇప్పటికే కరోనాకి వ్యతిరేఖంగా పోరాడుతున్న ప్రభుత్వం కోసం సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ సంస్థలు చాలా మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఓలా వైద్య సదుపాయాల కోసం కార్లను వినియోగిస్తూ తన మద్దతుని తెలిపింది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్