సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ అండ్ రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా, తమ కస్టమర్ల కోసం కొత్త ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. సురక్షితమైన, నాణ్యమైన రైడింగ్ అనుభవాన్ని కల్పించినందనకు గాను మెచ్చి డ్రైవర్లకు ఇచ్చే టిప్‌లను నేరుగా చేతులతో కాకుండా ఫోన్ యాప్ ద్వారానే అందించేలా ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

ఓలా పరిచయం చేసిన కొత్త ఇన్-యాప్ ‘టిప్పింగ్' ఫీచర్‌తో ఇప్పుడు కస్టమర్లు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, వారి డ్రైవర్ నిబద్ధతకు ప్రశంసల చిహ్నంగా టిప్‌లను మొబైల్‌లో చేర్చవచ్చు. భారతదేశంతో పాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా ఓలా ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

ఈ నగదు రహిత టిప్పింగ్ ఫీచర్, పేమెంట్ చేసే చివరి దశలో కనిపిస్తుంది. రైడ్ కోసం డ్రైవర్లకు టిప్ చేయడానికి ముందుగానే నిర్దేశించిన ఓ స్థిరమైన మొత్తాన్ని లేదా తమకు తోచిన మ మొత్తాన్ని ఎంచుకునే వెసలుబాటు ఉంటుంది. ఈ టిప్ నేరుగా డ్రైవర్‌కే చేరుతుంది, ఓలాకు ఈ టిప్‌తో సంబంధం ఉండదు. ఫలితంగా ఇది ఈ డ్రైవర్లకు అధిక సంపాదన సామర్థ్యానికి సహకరిస్తుంది. ఈ ఫీచర్ అన్ని రకాల రైడ్‌లకు వర్తించేలా రూపొందించబడింది. ప్రస్తుతం ఓలా ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్లకు పైగా డ్రైవర్-భాగస్వాములను కలిగి ఉంది.

MOST READ: ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

మరోవైపు, ఓలా ‘#SayThanksWithATip' అనే ఓ సోషల్ మీడియా క్యాంపైన్‌ని కూడా ప్రారంభించింది. కస్టమర్ల ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మార్చే డ్రైవర్లను గుర్తించి, వారికి ఎంతో కొంత బహుమతి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ క్యాంపైన్‌ను స్టార్ట్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

ఈ విషయంపై ఓలా ప్రతినిధి ఆనంద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, "మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, మా డ్రైవర్-భాగస్వాములు తమ సొంత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, అవసరమైన వారందరికీ అవసరమైన ప్రయాణాన్ని అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు, వారు వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నారు. కస్టమర్ల భద్రత మరియు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందిస్తున్నారు".

MOST READ: దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

"అధిక-నాణ్యత కలిగిన సేవలకు రివార్డులను అనుసంధానించడం, ఈ కష్ట సమయాల్లో మా ప్రశంసలను పంచుకోవడంలో మరియు వారికి మద్దతు ఇవ్వడంలో మాతో చేతులు కలపాలని మేము మా వినియోగదారులను ఆహ్వానిస్తున్నాము. ఈ కొత్త కార్యాచరణ ద్వారా డ్రైవర్లకు వారి ఆదాయాలను పెంచే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, వారి పట్ల ఎంతో కొంత సంఘీభావం తెలియజేసినట్లు అవుతుంది. ఇది కస్టమర్లకు మా డ్రైవర్లు మరింత ప్రత్యేకమైన శ్రద్ధతో సేవలను అందించేలా ప్రేరేపిస్తుందని" అన్నారు.

సోషల్ డిస్టెన్సింగ్ ఎఫెక్ట్: ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను పరిచయం చేసిన ఓలా క్యాబ్స్

ఓలా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను నిర్వహించడానికి ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, డ్రైవర్ పనితీరును మెచ్చుకొని కస్టమర్లు అందించే టిప్స్ అన్నీ కూడా నేరుగా డ్రైవర్లకే చేరుతాయి.

Most Read Articles

English summary
India's leading mobility and ride-hailing company, Ola has introduced a new in-app tipping features for customers. They can now reward the driver-partners for going the extra mile to deliver a safe and high-quality ride experience. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X