మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటి జనరల్ మోటార్స్. ఈ సంస్థ ఎక్కువ ప్రాచుర్యంలో లేదు కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం మూసివేయడం జరిగింది. ఈ విధంగా కంపెనీ మూసివేయడానికి ముందు జనరల్ మోటార్స్ ఒపెల్ తో సహా వివిధ బ్రాండ్లను తయారు చేసి విక్రయించేది. ఈ వాహనాలు అప్పట్లో భారతదేశంలో కూడా బాగా విస్తరించాయి.

అయితే ఇప్పుడు ఈ వాహనాలను చాలావరకు మరిచిపోయారు. భారతదేశంలో ఒకప్పుడు విక్రయించబడిన కొన్ని మరిచిపోయిన ఎస్‌యువిలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. !

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఒపెల్ ఆస్ట్రా

ఒపెల్ ఆస్ట్రా 1996 లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది. ఈ కారు సి 2 విభాగంలో జనరల్ మోటార్ యొక్క మొట్ట మొదటి లాంచింగ్ కార్. ఈ ఒపెల్ ఆస్ట్రా విలాసవంతమైన హై-ఎండ్ ఫీచర్లతో వచ్చింది. భారతదేశంలో మాస్ మార్కెట్ విభాగానికి జర్మన్ బిల్డ్ క్వాలిటీ మరియు హై-ఎండ్ ఫీచర్లు రావడానికి ఆస్ట్రా కారణమయింది. అంతే కాకుండా అప్పుడు మార్కెట్లో ఎక్కువ ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఈ సెడాన్ డీజిల్ మరియు పెట్రోల్ వెర్షన్లలో లభిస్తుంది. అయితే ఈ కార్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అప్పట్లోనే సన్‌రూఫ్‌తో లభించింది. ఇది ఆ రోజుల్లో పెద్ద విషయం.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఒపెల్ కోర్సా

ఒపెల్ కోర్సా మార్కెట్లో ఆస్ట్రా క్రింద ఉంది. అంతే కాకుండా ఈ బ్రాండ్ నుండి భారత మార్కెట్లో విడుదల చేసిన చివరి కార్లలో ఇది కూడా ఒకటి. ఇది మారుతి సుజుకి ఎస్టీమ్ మరియు ఫోర్డ్ ఐకాన్‌లతో పోటీ పడింది. కోర్సా మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వెలువడింది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఒపెల్ కోర్సా స్వింగ్

ఒపెల్ కోర్సా స్వింగ్ 2003 లో ప్రారంభించబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 92 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన వ్యాగన్లలో ఒకటి. అంతే కాకుండా ఇది గంటకు 170 కిమీ వేగంతో ప్రయాణించగలదు.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఒపెల్ కోరా సెయిల్

ఒపెల్ 2003 లో భారతదేశంలో కోర్సా యొక్క హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ లో కోర్సా సెయిల్‌ను ప్రారంభించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ. 4.39 లక్షలు. ఇది క్రాష్ సెన్సార్లు వంటి కొన్ని హైటెక్ పరికరాలను కూడా కలిగి ఉంది.

ఈ సెయిల్‌కు పెట్రోల్ ఇంజన్లు మాత్రమే ఉంటాయి. 1.4 లీటర్ ఇంజన్ 86 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సెయిల్ స్పోర్ట్ 1.6 లీటర్ 103 బిహెచ్‌పి ఇంజిన్‌తో వచ్చింది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఒపెల్ వెక్ట్రా

ఒపెల్ వెక్ట్రా 2002 లో ప్రారంభించబడింది. అంతే కాకుండా ఒపెల్ బ్రాండ్ నుండి అత్యంత ఖరీదైన సెడాన్ గా నిలిచింది. ఇది 2.2 లీటర్ 146 బిహెచ్‌పి ఇంజిన్‌తో నడిచింది. ఆ రోజుల్లో ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడింది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ఫారెస్టర్

చేవ్రొలెట్ ఫారెస్టర్ 2003 లో ప్రారంభించబడింది. ఇది ఇండియన్ మార్కెట్లో దాని ప్రారంభ సమయానికి ముందే ప్రారంభించబడింది. ఇది 2.0 లీటర్ బాక్సర్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. అది 120 బిహెచ్‌పి శక్తీ వద్ద 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 16 లక్షలు. ఈ విధంగా అధికమైన ధరను కలిగి ఉండటం వల్ల ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేయలేదు.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ఎస్ఆర్-వి

ఈ చేవ్రొలెట్ ఎస్ఆర్-వి 2006 లో ప్రారంభించబడింది. ఇది చేవ్రొలెట్ నుండి వచ్చిన పెద్ద శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్. కాని ఇది వాహన ప్రేమికులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. ఇది 5 సంవత్సరాల ముందు వరకు అమ్మకంలో ఉంది. దీని గరిష్ట ధర 7 లక్షల రూపాయలు.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ఎస్ఆర్-వి 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 103 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మార్కెట్లో కొంత ఎక్కువ ధరను కలిగి ఉండటం వల్ల ఎక్కువ అమ్మకాలు జరగలేదనే చెప్పాలి.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ఆప్ట్రా మాగ్నమ్

చేవ్రొలెట్ ఆప్ట్రా మాగ్నమ్ 2007 లో ప్రారంభించబడింది. ఆప్ట్రా మాగ్నమ్ ప్రారంభంలో అత్యంత శక్తివంతమైన మిడ్-సైజ్ డీజిల్ సెడాన్. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా గరిష్టంగా 125 బిహెచ్‌పి శక్తిని మరియు 305 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాగ్నమ్ 2007 నుండి 2012 వరకు అమ్మకానికి ఉంది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ఏవియో

చేవ్రొలెట్ ఏవియో, ఒపెల్ కోర్సా యొక్క వారసుడు. ఇది అదే 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో నడిచింది. ఇది సౌకర్యవంతమైన క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. ఏది ఏమైనా ఇది ఇండియన్ మార్కెట్లో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోలేదు.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

చేవ్రొలెట్ ట్రైల్బ్లేజర్

ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుగాంచిన ఈ ఎస్‌యువిని మొదట భారతీయ మార్కెట్లో చాలా లాంచ్ చేయలేదు. చివరికి తయారీదారు ట్రైల్బ్లేజర్‌ను విడుదల చేసారు. ఇది 2.8 లీటర్ ఇంజిన్‌తో 197 బిహెచ్‌పి మరియు 500 ఎన్‌ఎమ్ భారీ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో కనుమరుగైన జనరల్ మోటార్స్ కార్లు ఇవే

ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన కారు. ఏదేమైనా ఈ విభాగంలో ట్రైల్బ్లేజర్ కంటే ఎండీవర్ మరియు ఫార్చ్యూనర్ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి.

Source: Cartoq

Most Read Articles

English summary
10 FORGOTTEN Chevrolet & Opel cars & SUVs of India. Read in Telugu.
Story first published: Thursday, March 26, 2020, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X