పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేకి చెందిన భారత విభాగం, 'పోర్షే ఇండియా' డైరెక్టర్ పవన్ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంస్థతో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు పనిచేసిన తర్వాత వైదొలిగినట్లు ఆయన ప్రకటించారు.

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

డైరెక్టర్ పదవి నుండి పవన్ శెట్టి హఠాత్తుగా తొలగిపోవటంతో ప్రస్తుతం పోర్షే ఇండియాలో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్న ఆశిష్ కౌల్ సంస్థకు యాక్టింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

భారతీయ మార్కెట్లలో పోర్షే బ్రాండ్ ఉనికిని పెంచడంలో పవన్ శెట్టి కీలక పాత్ర పోషించారు మరియు పోర్షే కరెరా ఎస్, కరెరా క్యాబ్రియోలెట్ మరియు కయూన్ కూప్‌ వంటి పలు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడంలో భాగంగా ఉన్నారు.

MOST READ: 2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

పవన్ శెట్టి హెచ్‌ఎస్‌బిసిలో మానవ వనరులలో భాగంగా చేరడానికి ముందు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈయన టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, లాంబోర్ఘిని ఇండియా సంస్థల్లో కూడా పనిచేశారు.

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

ఇక పోర్షే సంబంధిత వార్తలను గమనిస్తే, పోర్షే పానమెరా మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఇందులో 10 ఇయర్స్ ఎడిషన్ పేరిట సరికొత్త స్టయిలింగ్‌తో తయారు చేసిన 'పోర్షే పానమెరా 4' మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. మార్కెట్లో ఈ కారు ధర రూ.1.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

MOST READ: ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ రైడ్ రివ్యూ.. దీనినే ఎందుకు కొనాలంటే ?

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

పోర్షే పానమెరా 4 ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌‌పై తయారైన ఈ 10 ఇయర్స్ ఎడిషన్‌లో కొత్తగా 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ కారులో రెండు ఫ్రంట్ డోర్లపై వైట్ గోల్డ్ కలర్‌లో 'పానమెరా 10' బ్యాడ్జింగ్ ఉంటుంది.

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

పోర్షే పానమెరా 4 10 ఇయర్స్ ఎడిషన్‌లో పవర్‌ఫుల్ 2.8 లీటర్, వి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 226 హార్స్ పవర్‌ల శక్తిని మరియు 450 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

MOST READ: మహీంద్రా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో 10 ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పోర్షే ఇండియా డైరెక్టర్ రాజీనామా; తదుపరి డైరెక్టర్ ఎవరు?

పోర్షే ఇండియా నుండి పవన్ శెట్టి వైదొలగడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఫోర్షే ఇండియా నుండి వైదొలగడానికి గల కారణాలను పవన్ శెట్టి వెల్లడించకపోయినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు కానీ లేదా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల కానీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఈ జర్మన్ బ్రాండ్ త్వరలోనే తమ భారతీయ విభాగానికి సారధ్యం వహించేందుకు కొత్త తయారీదారుని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాం.

Most Read Articles

English summary
German luxury car manufacturer, Porsche, has announced that Pawan Shetty, the Director at Porsche India has called it quits after four years and seven months with the company. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X