పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

ఇటీవల కాలంలో రోడ్డు రవాణా వ్యవస్థలు మరింత కఠినంగా మారుతున్నాయి. వాహనదారుల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు కూడా మరింత ఎక్కువవుతున్నాయి. నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా అదే రీతిలో ఉన్నాయి. అహ్మదాబాద్ లో ఒక వ్యక్తికి ఏకంగా ట్రాఫిక్ ఫైన్ 27.68 లక్షలు జరిమానా విధించారు. దీనిని గురించి మరింత తెలుసుకుందాం!

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

2019 నవంబర్ చివరి వారంలో అహ్మాదాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాధారణ తనిఖీకి నిర్వహించారు. ఈ విధంగా తనిఖీలు నిర్వహించే సమయంలో పోర్స్చే 911 వాహనదారుడైన పిఎస్‌ఐ ఎంబి విర్జాను ఈ తనీకీలో భాగంగా పట్టుకోవడం జరిగింది.

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

ఆ సమయంలో విర్జా వాహనం నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్నట్లు నిర్ధారించబడింది మరియు చెల్లుబాటు అయ్యే పత్రాలు అతని దగ్గర ఏవి కనుగొనబడలేదు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని రూ.9.80 లక్షల జరిమానా విధించారు. సంఘటన జరిగిన 6 వారాల తరువాత అహ్మదాబాద్ పోలీసులు ఈ జరిమానాలో ఒక నవీకరణను అందించారు.

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

గుజరాత్ ఆర్టీఓ ఇప్పుడు జరిమానాను రూ. 7.68 లక్షలకు సవరించారు. అవసరమైన పత్రాలు లేకపోవడం నేరంగా పరిగణించి ఈ జరిమానా విధించడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు వసూలు చేసిన అత్యధిక జరిమానాల్లో ఇది ఒకటి అని పోలీసు శాఖ కూడా చెబుతోంది.

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి), ఇన్సూరెన్స్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు అవసరమైన ప్రాథమిక పత్రాలు కలిగి ఉండాలి. ఇటీవలి కాలంలో ఈ పత్రాల కాపీని డిజిలోకర్‌లో చూపించడానికి ఒకరికి అనుమతి ఉంది. అవి చాలావరకు వ్యక్తిగతంగా తీసుకువెళ్ళకపోతే ఈ విధమైన జరిమానాలు విధించే అవకాశం ఉంది.

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

వాహన యజమానులు ఒకేసారి పలు వాహన సంబంధిత నేరాలతో ఆన్‌లైన్ లో ఆధారాలు తేలుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల సమాచారం అందించారు. ఇన్ని జారత్తలు తీసుకుంటున్నప్పటికీ అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎలా జరుగుతాయో అని ఆశ్చర్యపోతున్నారు.

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

మోటారు వాహనాల సవరణ చట్టం 2019 ప్రకారం ఇటీవలి కాలంలో జరిమానాలు సవరించబడినప్పటికీ, సవరించిన జాబితాలో జరిమానాలు మరింత ఎక్కువగా ఏమి లేవు. కానీ లైసెన్సింగ్ షరతుల ఉల్లంఘనలు జరిగితే మాత్రం లక్షల కొద్దీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ విధంగా పెరిగిన జరిమానాలు యొక్క ప్రాధమిక రూపు రేఖలను అర్థం చేసుకోవడానికి ఈ అహ్మదాబాద్ లో జరిగిన సంఘటన ఒక ఉదాహరణగా మారుతుంది.

Read More:టయోటా సీ-హెచ్ఆర్.. మరో సంచలనానికి తెరలేపిన జపాన్ దిగ్గజం

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జరిమానా విధించబడిన వాహనం సంఖ్య JH01DB0524 గా జాబితాలో చేర్చబడింది. జరిమానా విధించిన ఆర్డర్ ప్రకారం బ్యాలెన్స్-టాక్స్ 07-జనవరి -2020 నుండి 28-ఆగస్టు -2033 వరకు గల కాలానికి ఎంవి టాక్స్‌గా రూ .16 లక్షలు విధించడం జరిగింది.

Read More:2020 క్రెటా లాంచ్ డేట్ ఖరారు చేసిన హ్యుందాయ్

పోర్స్చే కార్ యజమానికి 27.68 లక్షల జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు, ఎందుకంటే....?

ఇంకా ఎంవీ పన్నుపై విధించే వడ్డీ దాదాపు 7,68,000 రూపాయలు. ఈ వాహనానిని విధించిన మొత్తం జరిమానా ఇంకా ఇతర ఫైన్లు కలిపి దాదాపు 27,68,000 లక్షల రూపాయలుగా నిర్దారించబడింది. ఇంత మొత్తంలో ఒక వాహనానికి జరిమానా విధించడం అనేది ఇదే మొదటి సారి.

Image Courtesy: Ahmedabad Police

Most Read Articles

English summary
Porsche owner fined Rs 27.68 L – One of the highest ever in India-Read in Telugu
Story first published: Thursday, January 9, 2020, 14:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X