వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్ష్, తయారు చేసిన ఎలక్ట్రిక్ సూపర్ కార్ "టేకాన్" తాజాగా ఓ ప్రపంచ రికార్డును సృష్టించింది. పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోనే పొడవైన డ్రిఫ్ట్ కోసం కొత్త ప్రపంచ రికార్డును సృష్టించినట్లు కంపెనీ ప్రకటించింది.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ మొత్తం 42.171 కిలోమీటర్ల దూరంలో 55 నిమిషాల పాటు డ్రిఫ్ట్ చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. జర్మనీలోని హాకెన్‌హీమ్రింగ్‌లో ఉన్న పోర్ష్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో ఈ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం జరిగింది.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

పోర్ష్ ఇన్‌స్ట్రక్టర్ డెన్నిస్ రెటెరాను ఈ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం కోసం ఎంపిక చేశారు. నీటితో నిండిన మొత్తం 200 మీటర్ల వృత్తాకార ట్రాక్‌లో డెన్నిస్ 210 ల్యాప్‌లను పూర్తి చేసి, ముందు చక్రాలను అసలు ఒకే దిశలో లేకుండా డ్రిఫ్టింగ్ చేశాడు.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

ప్రస్తుతం చైనా మార్కెట్లో అమ్మకానికి ఉన్న పోర్ష్ టేకాన్ యొక్క రియర్ వీల్ డ్రైవర్ వెర్షన్‌ను ఉపయోగించి ఈ డ్రిఫ్ట్ రికార్డ్ సాధించారు. అధికారిక నివేదికల ప్రకారం, రెటెరా సగటున గంటకు 46 కి.మీ వేగంతో 210 ల్యాప్‌ల కోసం డ్రిఫ్ట్‌ను చేశారు.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

డెన్నిస్ రెటెరా కారు గురించి మాట్లాడుతూ, "డ్రైవింగ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌లను స్విచ్ ఆఫ్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ పోర్ష్ (టేకాన్)తో పవర్‌లైడ్ చాలా సులభం, ముఖ్యంగా ఈ మోడల్ వెనుక చక్రాల ద్వారా ప్రత్యేకంగా నడపబడుతుందని" చెప్పారు.

MOST READ:KLX 300 డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ ఆవిష్కరించిన కవాసకి ; పూర్తి వివరాలు

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

"ఈ కారులో తగినంత శక్తి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం మరియు లాంగ్-వీల్‌బేస్ స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. చాస్సిస్ మరియు స్టీరింగ్ యొక్క ఖచ్చితమైన రూపకల్పన పక్కకి కదిలేటప్పుడు కూడా అన్ని సమయాల్లో ఖచ్చితమైన నియంత్రణకు అనుమతిస్తుందని" డెన్నిస్ వివరించారు.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

వరల్డ్ రికార్డ్ ప్రయత్నం గురించి రెటెరా మాట్లాడుతూ, "210 ల్యాప్‌ల కోసం నా ఏకాగ్రతను ఎక్కువగా ఉంచడం నాకు చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా నీటితో నిండిన డ్రిఫ్ట్ సర్క్యూట్ ప్రతిచోటా ఒకే రకమైన గ్రిప్‌ను అందించదు. స్టీరింగ్‌తో డ్రిఫ్ట్‌ను నియంత్రించడంపై నేను దృష్టి పెట్టాను - ఇది యాక్సిలరేటర్ పెడల్ ఉపయోగించడం కంటే సమర్థవంతంగా ఉంటుంది మరియు స్పిన్నింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని" చెప్పారు.

MOST READ:భారత్‌లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

పోర్ష్ టేకాన్, ఈ జర్మన్ బ్రాండ్ లభిస్తున్న మొట్టమొదటి మరియు పూర్తి-ఎలక్ట్రిక్ సూపర్ కార్. టేకాన్ మంచి శక్తి సామర్థ్యాలు కలిగిన ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఇది టెస్లా మాదిరిగా సుదీర్ఘమైన రేంజ్‌ను అందించనప్పటికీ, పెర్ఫార్మెన్స్ మరియు మెయింటినెన్స్‌లో ఇది దానికంటే మెరుగ్గా ఉంటుంది. ఆధునిక ఈవీ సాంకేతిక పరిజ్ఞానం, పోర్ష్ యొక్క పాపులర్ హ్యాండ్లింగ్ మరియు డ్రైవింగ్ డైనమిక్‌లను టేకాన్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ మిళితం చేస్తుంది.

వరల్డ్ రికార్డ్ సృష్టించిన పోర్ష్ ఎలక్ట్రిక్ సూపర్ కార్, ఎలాగో తెలుసా?

పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ సూపర్ కార్ డ్రిఫ్టింగ్ రికార్డ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పోర్ష్ టేకాన్ ఓ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ సూపర్ కార్. వాస్తవానికి ప్రపంచ డ్రిఫ్ట్ రికార్డ్ అంత సులభం కాదు, అందులోనూ ఓ ఎలక్ట్రిక్ కారుతో ఇది చాలా కష్టమైన విషయం. కానీ పోర్ష్ టేకాన్ మరియు డెన్నిస్ రెటెరాలు సంయుక్తంగా ఈ ప్రపంచ రికార్డును సాధించారు.

MOST READ:కియా సోనెట్ డెలివరీ ఇప్పుడు కొత్త స్టైల్‌లో.. ఎలాగో మీరే చూడండి

Most Read Articles

English summary
Porsche's electric supercar Taycan has created a new world record for 'the longest drift in an electric vehicle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X