ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే భారతదేశంలో ఎలక్ట్రిక్ టేకాన్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మొట్ట మొదట పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని 2019 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించబడింది. ఈ సంవత్సరంలోనే ఇది టర్బో మరియు టర్బో ఎస్ వేరియంట్లలో భారతదేశంలో లభిస్తుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

పోర్షే ఎలక్ట్రిక్ కారు మంచి డిజైన్లతో ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. ఇందులో ఉన్న ఎల్ఇడి హెడ్‌లైట్లు వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

పోర్షే టేకాన్ లో ఒక హైలెట్ డిజైన్ ఏమిటంటే ఇందులో ఉన్న ఛార్జింగ్ పోర్ట్, ఇది వాహనం యొక్క ఎడమవైపు పెండర్ లో నిర్మించబడింది. డిజైన్ లక్షణాల్లో సింగిల్ బార్ రియర్ టెయిల్ లైట్ ఉంటుంది. బూట్ లిప్ అంతటా విస్తరించి ఉన్న బార్ కూడా టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ గా పని చేస్తాయి. ఇందులో బూమరింగ్ ఆకారంలో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

డాష్‌బోర్డ్ చాలా తక్కువ మరియు చాలా పొడవైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వలె కనిపిస్తుంది. ఆర్మ్‌రెస్ట్ సీటు మరియు డాష్‌బోర్డ్ మొత్తం పొడవున నడుస్తుంది మరియు చిన్న ఆటోమేటిక్ మోడ్ షిఫ్టర్ మరియు స్మార్ట్‌ఫోన్ కోసం ఫ్లాట్ డాక్‌ను కలిగి ఉంటుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న పోర్షే టేకాన్ 93.4 కిలోవాట్ల హై-వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది రెండు మోటారులకు శక్తినిస్తుంది. ఈ రెండు మోటార్లు 614 బిహెచ్‌పి శక్తిని సమిష్టిగా ఉత్పత్తి చేస్తాయి. పోర్స్చే టేకాన్ మోడళ్లను ఓవర్‌బూస్ట్ పవర్ ఆప్షన్‌తో అందించనుంది. ఇది విద్యుత్ ఉత్పాదనలను టేకాన్ టర్బో మోడల్‌లో 668 బిహెచ్‌పిని మరియు టేకాన్ టర్బో ఎస్ మోడల్‌లో 759 బిహెచ్‌పిని పెంచుతుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

పోర్షే టేకాన్ శక్తి గణాంకాలను గమనించినట్లైతే టర్బో మోడల్‌ గంటకు 0 నుండి 100 కి.మీ అగ్జలిరేట్ చేయడానికి 3.2 సెకన్లు మరియు మరియు టర్బో ఎస్ మోడల్ 2.8 సెకన్ల కాలం మాత్రమే పడుతుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

పోర్షే టేకాన్ మోడల్స్ పూర్తి ఛార్జీతో 450 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయని కంపెనీ ధ్రువీకరించింది. ఇంక ఛార్జింగ్ విషయానికి వస్తే 800 వి ఛార్జర్ ని ఉపయోగించి బ్యాటరీని కేవలం 23 నిముషాల్లో 5 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

భారతదేశంలో ఈ వాహనాల యొక్క నిర్దిష్ట ధర ఇంకా ప్రకటించబడనప్పటికీ, పోర్షే టేకాన్ నమూనాలు పూర్తిగా నిర్మించిన యూనిట్లుగా వస్తాయి మరియు జర్మనీ నుండి దిగుమతి చేయబడతాయి. ఈ మోడల్స్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్ మార్కెట్లలో సుమారు రూ. 70 లక్షల నుండి రూ. 1.10 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్స్ ధర దాదాపుగా రూ. 2.7 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఎందుకంటే భారతదేశంలో వివిధ టాక్స్ ల వల్ల ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇండియాలో అడుగుపెట్టనున్న పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఎప్పుడో తెలుసా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పోర్షే టేకాన్ యొక్క ధర భారతదేశంలో అధికంగా ఉన్నప్పటికీ వాహనప్రియులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోర్షే టేకాన్ చూడటానికి చాలా విలాసవంతంగా ఉండటమే కాకుండా బాగా పని చేస్తుందని కంపెనీ నిర్దారించింది. వాహనం యొక్క వేగం, ఛార్జింగ్ వంటివన్నీ వాహనదారులను బాగా ఆకర్షిస్తాయి. వాతావరణంలో సమతుల్యతను కాపాడటానికి పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

Most Read Articles

English summary
Porsche Taycan Electric Vehicle To Launch In India This Year. Read in Telugu.
Story first published: Tuesday, February 11, 2020, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X