Just In
Don't Miss
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెనో జోయ్ ఎలక్ట్రిక్: విడుదల ఎప్పుడంటే?
రెనో ఇండియా జోయ్ ఎలక్ట్రిక్ కారుతో 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సందడి చేసేందుకు సిద్దమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనో జోయ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన టీజర్ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

హ్యుందాయ్ మరియు ఎంజీ మోటార్ బాటలోనే రెనో కూడా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్దమైంది. పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తొలుత దిగుమతి చేసుకుని, తర్వాత దేశీయంగానే ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది.
ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో జోయ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు రెనో ఇండియా ఆసక్తికనబరుస్తోంది. సమాచార వర్గాల కథనం మేరకు ఇండియన్ రోడ్లు మరియు వాతావరణ పరిస్థితుల అనుగుణంగా సిద్దం చేసేందుకు ఇప్పటికే రహస్యంగా జోయ్ ఎలక్ట్రిక్ కారును పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

రెనో జోయ్ ఎలక్ట్రిక్ కారు నిజానికి చాలా పాతది మరియు భారీ సక్సెస్ కూడా సాధించింది. తొలుత దీనిని 2012 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు. అదే ఏడాది ప్యారిస్ మోటార్ షోలో దీనిని అంతర్జాతీయ విపణిలోకి లాంచ్ చేశారు.

రెనో జోయ్ ఎలక్ట్రిక్ కారును వివిధ దశలలో ఎన్నో రకాల డిజైన్ అప్డేట్స్ మరియు మెకానికల్ మార్పులు చేశారు. చివరగా అక్టోబర్ 2019లో లేటెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేశారు. కొలతల పరంగా దీనిని బీ-సెగ్మెంట్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ అంటారు, పోల్చి చెప్పాలంటే టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 తరహాలో ఉంటుంది.

సాంకేతికంగా ఇందులో 52kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలదు. కస్టమర్లు దీనిని R110 లేదా R135 ఎలక్ట్రిక్ మోటార్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు. R110 మోటార్ వేరియంట్ 108పీఎస్ పవర్ మరియు 225ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా R135 మోటార్ వేరియంట్ 135పీఎస్ పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రెనో జోయ్ R110 వెర్షన్ సింగల్ ఛార్జింగ్‌తో 395కిలోమీటర్లు మరియు R135 వెర్షన్ 386కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 50kW DC ఛార్జర్‌తో 1 గంట 10 నిమిషాల్లో బ్యాటరీని 80శాతం ఛార్జ్ చేయొచ్చు.

రెనో జోయ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు ఫీచర్ల విషయానికి వస్తే, C-ఆకారంలో ఉన్న డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 17-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డైనమిక్ టర్న్ సిగ్నల్స్ (వెనుక వైపున) మరియు ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు స్టైలిష్ ఎలిమెంట్స్ వచ్చాయి.

ఇటీరియర్ విషయానికి వస్తే, రెనో జోయ్ ఎలక్ట్రిక్ కారులో 10-ఇంచుల ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 9.3-ఇంచుల పోర్ట్ట్రేట్ స్టైల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్-లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మరియు లెథర్ అప్హోల్స్ట్రే వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

రెనో జోయ్ ఎలక్ట్రిక్ కారును 2021లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, దీని ధర సుమారుగా రూ. 12 లక్షల నుండి 16 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్లోకి దీనికి ఎలాంటి పోటీ లేదు.