దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ఇండియా, దేశంలో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. గడచిన నాలుగు నెలల కాలంలో భారతదేశం అంతటా మొత్తం 17 కొత్త సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

ఈ 17 టచ్‌పాయింట్లలో 14 కొత్త షోరూమ్‌లు కాగా, మిగిలిన 3 వర్క్‌షాపులుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలోనే ఈ 17 టచ్‌పాయింట్లను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వివరించింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ బ్రాండ్ విస్తృతిని పెంచే వ్యాపార వ్యూహంలో భాగం రెనాల్ట్ ఈ కొత్త టచ్‌పాయింట్లను చేర్చింది.

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

రెనాల్ట్ ఇండియా గడచిన నాలుగు నెలల కాలంలో ఏర్పాటు చేసిన 17 టచ్‌పాయింట్లలో నాలుగు హిమాచల్ ప్రదేశ్‌లో ఉండగా, తెలంగాణలో మూడు; రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్‌లలో రెండు మరియు ఢిల్లీ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కటి చొప్పున ఉన్నాయి.

MOST READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

ఈ విషయంపై రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సిఈఓ మరియు ఎమ్‌డి వెంకట్రామ్ మామిల్లాపల్లె మాట్లాడుతూ.. "రెనాల్ట్ బ్రాండ్ ప్రపంచ వృద్ధి ప్రణాళికలకు భారతదేశం ఒక ముఖ్యమైన మార్కెట్, మరియు ఈ డైనమిక్ ఆటోమోటివ్ మార్కెట్ కోసం మాకు సమగ్రమైన వ్యాపార వ్యూహం ఉంది. మా వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ మరియు వినియోగదారుని సంతృప్తి నిర్ధారించడానికి ఇది మా బలమైన ఉత్పత్తి మెరుగుదల వ్యూహం" అని అన్నారు.

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

"ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేము జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఈ కాలంలో మేము కొత్త డీలర్లను ఆకర్షించడం పట్ల సంతోషంగా ఉన్నాము. అలాగే ఇప్పటికే ఉన్న భాగస్వాములచే ఎక్కువ పెట్టుబడులు మరియు విస్తరణ అభ్యర్థనలను పొందడం కూడా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది మేము మరింత మెరుగ్గా పనిచేయటానికి మరియు మా ఉనికిని విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. మెట్రో నగరాల్లోనే కాకుండా టైర్ 2-4 నగరాల్లో కూడా పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ విస్తరణ ప్రణాళిక సహకరిస్తుంద"ని అన్నారు.

MOST READ:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్ - ఆకర్షనీయమైన రేసింగ్ యల్లో కలర్‌లో

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

కొత్తగా 17 టచ్‌పాయింట్‌లతో జోడించడంతో, రెనాల్ట్ ఇండియాకి ఇప్పుడు దేశవ్యాప్తంగా 390 సేల్స్ మరియు 470 సర్వీస్ నెట్‌వర్క్‌లను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో రెనాల్ట్ బ్రాండ్ విజయం సాధించడానికి ఈ విస్తరణ కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి విడుదల చేసినప్పటి నుండి కంపెనీ దేశంలో తమ నెట్‌వర్క్ విస్తరణను భారీగా చేపట్టింది.

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ ప్రస్తుతం టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో నడిచే డస్టర్ ఎస్‌యూవీని పరిచయం చేసే పనిలో బిజీగా ఉంది. రెనాల్ట్ డస్టర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ ఈ నెలలో ఎప్పుడైనా భారతదేశంలో విడుదల కావచ్చని సమాచారం. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని తట్టుకునే విధంగా అధునాతన సాంకేతికతతో ఈ మోడల్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

MOST READ:అలర్ట్ : వాహనాలు బయట పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇది చూడండి

దేశంలో విస్తరిస్తున్న రెనాల్ట్ వ్యాపారం, నాలుగు నెలల్లో 17 కొత్త అవుట్‌లెట్స్

భారత్‌లో రెనాల్ట్ విస్తరణ ప్రణాళికపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనాల్ట్ ఇండియా భారత మార్కెట్ నుంచి తన మోడళ్లకు చాలా మంచి స్పందనను అందుకుంది. ఇటీవలే విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ క్విడ్ మరియు ట్రైబర్ మోడళ్లు మార్కెట్లో మంచి విజయాన్ని సాధించాయి. వార్షిక అమ్మకాల పరంగా రెనాల్ట్ ఇండియా 75 శాతం వృద్ధిని కనబరిచింది.

Most Read Articles

English summary
Renault India has announced an expansion to its dealership network in the country. The French carmaker has introduced a total of 17 new sales and service touchpoints across India, over the last 4 month period. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X