రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌లో కంపెనీ కొత్తగా మరో వేరియంట్‌ను విడుదల చేసింది. 'రెనాల్ట్ క్విడ్ ఆర్‌ఎక్స్ఎల్' పేరిట కొత్త 1.0 లీటర్ బిఎస్6 వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.4.16 లక్షలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

రెనాల్ట్ క్విడ్ ఆర్‌ఎక్స్ఎల్ వేరియంట్‌లోని 1.0-లీటర్ ఇంజన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో లభ్యం కానుంది. ఇందులో ఎఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో ఉన్న రెనాల్ట్ క్విడ్ ఆర్‌ఎక్స్ఎల్ 1.0 లీటర్ వేరియంట్ ధర ధర రూ.4.48 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త రెనాల్ట్ క్విడ్ ఆర్‌ఎక్స్ఎల్ వేరియంట్ ఇప్పుడు 999 సిసి త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పి శక్తిని మరియు 4,250 ఆర్‌పిఎమ్ వద్ద 91 ఎన్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకు చెప్పినట్లుగా, ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ ఆర్‌ఎక్స్ఎల్ వేరియంట్‌ను ఏఎమ్‌టి ఆఫర్ చేస్తుండటంతో ఇప్పుడు ఇది భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన ఏఎమ్‌టి మోడల్ అయ్యింది.

MOST READ: పరుగులుపెడుతున్న మహీంద్రా బొలెరో అమ్మకాలు, కారణం ఏంటో తెలుసా !

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 3.5 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఇకపోతే, 45,000 రెనాల్ట్ క్విడ్ కార్లను ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా కంపెనీ ఎగుమతి చేసింది.

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన సందర్భంగా రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిల్లాపల్లె మాట్లాడుతూ, "భారతదేశం వేదికగా రెనాల్ట్ క్విడ్ కారును ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయటం జరిగింది, ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఇక్కడి మార్కెట్లో అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంది మరియు గ్రూప్ రెనాల్ట్ యొక్క వృద్ధి ఆశయాలలో ఈ మోడల్ ముఖ్యమైన పాత్రను పోషించింది. భారతదేశంలో మా పురోగతికి క్విడ్ ఒక ముఖ్యమైన సహకారిగా నిలిచింద"ని అన్నారు.

MOST READ: కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

"3.5 లక్షలకు పైగా క్విడ్ కుటుంబాలతో, మా వినియోగదారులు బ్రాండ్ రెనాల్ట్‌పై ఉంచిన నమ్మకానికి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పటి నుంచి ఇది డిజైన్, ఇన్నోవేషన్ మరియు ఆధునికత పరంగా పురోగతి సాధించింది, ఇధి మాకు గేమ్ ఛేంజర్ మోడల్‌గా మారిందని" చెప్పారు.

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారతదేశంలో రెనాల్ట్ క్విడ్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తోంది. అవి - స్టాండర్డ్, ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టి, ఆర్ఎక్స్‌టి (ఆప్షనల్) మరియు క్లైంబర్ (ఆప్షనల్). వీటిలో స్టాండర్డ్, ఆర్‌ఎక్స్‌ఈ మరియు ఆర్‌ఎక్స్ఎల్ వేరియంట్లు తక్కువ సామర్థ్యం కలిగిన 800 సిసి త్రీ సిలిండర్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 53 బిహెచ్‌పి శక్తిని మరియు 72 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇకపోతే రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించే వాటిలో మిడ్-స్పెక్ ఆర్ఎక్స్ఎల్ మరియు ఆర్ఎక్స్‌టి వేరియంట్లు ఉన్నాయి.

MOST READ: డ్యుకాటి పానిగేల్ వి2 వైట్ రోసో ఆవిష్కరణ - స్పెసిఫికేషన్లు, వివరాలు

రెనాల్ట్ క్విడ్‌లో కొత్త వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్ 1.0 లీటర్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనాల్ట్ క్విడ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి. ఇది ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో చాలా ఆకర్షణీయమైన మోడల్. రెనాల్ట్ క్విడ్ ఈ సెగ్మెంమెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెసోకు గట్టి పోటీ ఇస్తుంది. మిడ్-స్పెక్ వేరియంట్లలో అధిక సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను చేర్చడం వలన రెనాల్ట్ క్విడ్ వైపు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షితులయ్యారు.

Most Read Articles

English summary
Renault India has expanded the portfolio of the Kwid in the Indian market with the addition of the RXL 1.0-litre BS6 variant to their lineup. The Renault Kwid RXL variant now comes powered with the BS6-compliant 1.0-litre engine and is offered with a starting price of Rs 4.16 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X