వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనాల్ట్ క్యాప్చర్ లో ఓ సరికొత్త బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. రెనాల్ట్ తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి బిఎస్4 క్యాప్చర్ మోడల్‌ను తొలగించి వేసింది. దీన్ని బట్టి చూస్తుంటే అతి త్వరలోనే సరికొత్త 2020 రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

రెనాల్ట్ క్యాప్చర్ ఎస్‍‌యూవీ తొలిసారిగా 2017లో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. నిస్సాన్-రెనాల్ట్ భాగస్వామ్యంలో భాగంగా, ఈ ఇరు కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్0 (M0) ప్లాట్‌ఫామ్‌పై రెనో క్యాప్చర్ ఎస్‌యూవీని తయారు చేశారు. ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో మోడళ్లను కూడా తయారు చేశారు. వాస్తవానికి క్యాప్చర్ ఇండియన్ మార్కెట్లో ఆశించిన సక్సెస్‌ను సాధించలేక పోయింది.

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

ఈ నేపథ్యంలో, సరికొత్త 2020 రెనో క్యాప్చర్‌ను గతంలోని అపజయాలను దృష్టిలో ఉంచుకొని మరింత స్టయిలిష్‌గా తీర్చిదిద్దారు. భారత్‌లో ఇప్పటి వరకూ విక్రయించబడిన బిఎస్4 రెనో క్యాప్చర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభించేంది.

MOST READ: బిఎస్6 జావా మోటార్‌సైకిళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్ఈ క్లాసిక్ 350కి గట్టి పోటీ..!

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించేంది.

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

ఇకపోతే, డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మాత్రం ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమ్ముడయ్యేది.

MOST READ: సరికొత్త హోండా గ్రాజియా బిఎస్6 స్కూటర్ టీజర్ విడుదల, వివరాలు

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ వెబ్‌సైట్ నుంచి తొలగించి వేయటంతో కంపెనీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అధికారికంగా మూడు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అవి - క్విడ్, ట్రైబర్ మరియు డస్టర్. ఈ మూడు మోడళ్లు కూడా బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

కాగా.. కొత్త 2020 రెనాల్ట్ క్యాప్చర్ ప్రారంభంలో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

MOST READ: ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం!

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

రెనాల్ట్ అనుబంధ సంస్థ నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త రెనో క్యాప్చర్ బిఎస్‌6 వెర్షన్‌లో కూడా ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నిస్సాన్ కిక్స్‌లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే, రెనో క్యాప్చర్‌లో ఈ ఇంజన్‌ను ఆఫర్ చేస్తారా లేదా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

ఇక బిఎస్6 2020 రెనాల్ట్ క్యాప్చర్ విషయానికి వస్తే.. ఇదివరకటి మోడల్ కన్నా మరింత స్టయిలిష్ డిజైన్ మరియు మరిన్ని ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లతో ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రీడిజైన్ చేయబడిన క్యాబిన్, కొత్త హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది. ఇంజన్ అప్‌డేట్స్ కారణంగా రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 ధరల్లో కూడా పెరుగదల ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అమ్ముడైన బిఎస్4 క్యాప్చర్ ధరలు రూ.9.49 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్యలో ఉండేవి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

వెబ్‌సైట్ నుంచి మాయమైన రెనాల్ట్ క్యాప్చర్, బిఎస్6 విడుదల కోసమేనా..?

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 లాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనాల్ట్ ఇప్పటికే అప్‌గ్రేడ్ చేయబడిన క్యాప్చర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. రెనాల్ట్ ఇండియా తమ వెబ్‌సైట్ నుంచి ఈ మోడల్‌ను తొలగించడం చూస్తుంటే అతి త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా రానున్న బిఎస్6 రెనాల్ట్ క్యాప్చర్‌తో భారత ఎస్‌యూవీ మార్కెట్లో మంచి పట్టు సాధించాలని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Renault India has removed the Captur SUV from their official website. The Renault Captur is yet to be updated to comply with the BS6 emission norms in the Indian market, which was implemented from the start of April 2020. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X