ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

భారతదేశంలో ఇప్పుడు దాదాపు అన్నిసంస్థలు బిఎస్ 6 వెర్షన్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే రెనాల్ట్ కంపెనీ కూడా బిఎస్ 6 వేరియంట్ ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

ఆల్-న్యూ రెనాల్ట్ ట్రైబర్ బిఎస్ 6 వేరియంట్ ని రూ. 4.99 లక్షల (ఎక్స్ షోరూమ్- ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో ఇంజిన్ మాత్రమే అప్‌గ్రేడ్ చేయబడి ఉంటుంది. మిగిలిన అన్ని భాగాలు అదేవిధంగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

రెనాల్ట్ బ్రాండ్ నుంచి అత్యధికంగా అమ్మబడిన వాహనాలలో ట్రైబర్ ఒకటి. ఇది భారీగా సవరించిన సిఎమ్ఎఫ్ - ఎ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల వాహనంలో క్యాబిన్ ప్లేస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

ట్రైబర్ బిఎస్ 6 మోడళ్లలో క్రోమ్ స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, సెంట్రల్లి పొసిషన్డ్ ఎయిర్ డ్యామ్ మరియు స్కఫ్ ప్లేట్‌, బంపర్ ఉంటాయి. ఇవే కాకుండా ట్రైబర్ యొక్క వెనుక భాగంలో పొడవైన టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్టాప్ లైట్‌తో రూఫ్ స్పాయిలర్ వంటివి ఇందులో కొంత ప్రత్యేకంగా ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

వాహనం యొక్క ఇంటీరియర్స్‌లో డ్యూయల్ టోన్ ఫినిషింగ్, సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ మరియు డాష్‌బోర్డ్ చుట్టూ పొడవైన సిల్వర్ ప్యానెల్ ఉన్నాయి. ఎలెక్ట్రికల్లి అడ్జస్టబుల్ ORVM లు, ఒక ఎల్ఇడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ మరియు డే & నైట్ అడ్జస్టబుల్ ఐఆర్విఎమ్ లు ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

రెండవ మరియు మూడవ వరుసలో ప్రయాణించే పాసింజర్స్ కోసం ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు అన్ని వరుసలలో 12 వి ఛార్జింగ్ సాకెట్లు, స్మార్ట్ యాక్సెస్ కార్డ్ మరియు ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

రెనాల్ట్ ట్రైబర్ బిఎస్ 6 మోడళ్లలో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో మల్టిఫుల్ ఎయిర్ బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ సిస్టమ్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, పెడెస్ట్రయిన్ ప్రొటెక్షన్ సిస్టం మరియు బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

రెనాల్ట్ ట్రైబర్ బిఎస్ 6 మోడల్ బిఎస్ 6 వెర్షన్లో ఉన్నప్పటికీ అదే 1.0 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్ అదే 71 బిహెచ్‌పి శక్తిని మరియు బిఎస్ 4 ఇంజన్ ఉత్పత్తి చేసే 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

BS6- కంప్లైంట్ రెనాల్ట్ ట్రైబర్ ధర క్రింది విధంగా ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్ బిఎస్-6 ప్రైస్ బిఎస్- 4 లాంచ్ ప్రైస్ డిఫరెన్స్
ఆర్ఎక్స్ఇ రూ. 4.99 లక్షలు రూ. 4.95 లక్షలు రూ. 4,000
ఆర్ఎక్స్ఎల్ రూ. 5.74లక్షలు రూ. 5.59 లక్షలు రూ. 15,000
ఆర్ఎక్స్ టి రూ. 6.24 లక్షలు రూ. 6.09లక్షలు రూ. 15,000
ఆర్ఎక్స్ జెడ్ రూ. 6.78 లక్షలు రూ. 6.63లక్షలు రూ. 15,000

ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 రెనాల్ట్ ట్రైబర్ ధర ఎంతో తెలుసా..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు మార్కెట్లో రూ. 4.99 లక్షల నుండి ప్రారంభించింది. బిఎస్-6 మోడళ్లలో రూ. 15 వేల పెంపు అంచనా వేయబడింది. కానీ రెనాల్ట్ ట్రైబర్ యొక్క ఎంట్రీ లెవల్ మోడళ్లను కూడా విక్రయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 4,000 రూపాయల పెంపుతో, ఆర్ఎక్స్ఇ మోడల్ ఆఫర్‌లో ఉన్న ఇతర మూడు వేరియంట్‌లను మరింత మెరుగ్గా చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Renault Triber BS6 Models Launched In India Starting At Rs 4.99 Lakh Ex-Showroom. Read in Telugu.
Story first published: Tuesday, January 28, 2020, 10:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X