మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ట్రైబర్ ఎమ్‌పివి ధరలను మరోసారి పెంచింది. రెనాల్ట్ ఇండియా గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో బిఎస్6 ట్రైబర్ ఎమ్‌పివిని భారత్‌లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ మోడల్ ధరలు మూడుసార్లు పెరిగాయి. తాజాగా కంపెనీ మరోసారి ఈ మోడల్ ధరను పెంచింది.

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

విడుదలైనప్పటి నుండి ఈ మోడల్ ధరలు పెరగడం ఇది వరుసగా నాల్గవసారి. మునుపటి ధరల పెంపులో రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ధరను కంపెనీ మార్చలేదు. అయితే, ఇప్పుడు అన్ని వేరియంట్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. వేరియంట్‌ను బట్టి ప్రస్తుత ధరల పెరుగుదల రూ.11,500 నుండి రూ.13,000 మధ్యలో ఉంటుంది.

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి ఈ విభాగంలో అద్భుతమైన ప్యాకేజీతో మంచి స్టైలిష్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎమ్‌పివి ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుంది. గత సంవత్సరం దేశీయ విపణిలో విడుదలైన ట్రైబర్ ఎమ్‌పివిని, ఇప్పటి వరకూ 40,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

Triber New Price Old Price Difference
RxE ₹5,12,000 ₹4,99,000 ₹13,000
RxL ₹5,89,500 ₹5,78,000 ₹11,500
RxL AMT ₹6,29,500 ₹6,18,000 ₹11,500
RxT ₹6,39,500 ₹6,28,000 ₹11,500
RxT AMT ₹6,79,500 ₹6,68,000 ₹11,500
RxZ ₹6,94,500 ₹6,82,000 ₹12,500
RxZ AMT ₹7,34,500 ₹7,22,000 ₹12,500

MOST READ:ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 లాంచ్ : ధర & ఇతర వివరాలు

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

రెనాల్ట్ ట్రైబర్ కాంపాక్ట్-ఎమ్‌పివి 3,990 మిమీ పొడవు, 1,739 మిమీ వెడల్పు, 1,643 మిమీ ఎత్తు, 2,636 మిమీ వీల్ బేస్ మరియు 182 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

ఈ ఎమ్‌పివి ముందు భాగంలో హాలోజన్ బల్బులతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్‌ ఉంటుంది. ఫాగ్ లైట్ల స్థానంలో బంపర్ దిగువ భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్‌ను అమర్చారు. ట్రైబర్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడానికి, కంపెనీ గ్రిల్‌పై, హెడ్‌లైట్ హౌసింగ్ లోపల మరియు డిఆర్‌ఎల్‌ల చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లతో గార్నిష్ చేసింది.

MOST READ:మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

ట్రైబర్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌లో డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్ మరియు సీట్స్ ఉంటాయి. ఇంటీరియర్ ప్రీమియం లుక్‌ని పెంచడానికి డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ సెంటర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

ఇంజన్ విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిలో 1.0-లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 70 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో కొత్త 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా విడుదల చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మరోసారి పెరిగిన రెనాల్ట్ ట్రైబర్ ధర; ఇది వరుసగా నాల్గవసారి!

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి ధరల పెరుగుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి అత్యంత సరసమైన ధరకే లభించే బెస్ట్ సెవన్ సీటర్ కారు. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఇది సౌకర్యవంతంగానే అనిపిస్తుంది మరియు మంచి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత ధరల పెరుగుదలతో ట్రైబర్ ఎమ్‌పివి మునుపటి కన్నా కాస్తంత ప్రీమయంగా మారింది. అయినప్పటికీ, ఇది భారత మార్కెట్లో ఉన్న ఇతర ఏడు సీట్ల వాహనాల కంటే చౌకగానే ఉంటుంది.

Most Read Articles

English summary
Renault launched the Triber last year in August. Since its inception, the Triber has received many price hikes, to be precise three times. However, the company has recently increased prices for the Triber once again for the fourth time. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X