భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రజల్లో అవగాహన పెరిగి, వాటికి డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనా విభాగంలోని అవకాశాలను దక్కించుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారత మార్కెట్లో అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల అవుతుండగా, తాజాగా ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) కూడా ఓ ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న తమ జో ఈ.వి స్మాల్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ టెస్టింగ్ వాహనం ఇటీవలే భారత రోడ్లపై కనిపించింది. తమిళనాడు టెస్ట్ నెంబర్ ప్లేట్‍తో నగరవీధుల్లో టెస్టింగ్ చేస్తున్న రెనో జో ఎలక్ట్రిక్ కారును కార్ క్రేజీ ఇండియా తమ కెమెరాలో బంధించింది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో తొలిసారిగా తమ జో ఈ.వి కారును ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. భారత మార్కెట్లో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడంపై కంపెనీ మార్కెట్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది.

MOST READ:చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్.. ఎందుకో తెలుసా ?

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఇన్‌స్టాగ్రామ్‌లో కార్ క్రేజీ ఇండియా పోస్ట్ చేసిన రెనో జో స్పై చిత్రాలను గమనిస్తే, కంపెనీ ఈ కారును ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఈ చిత్రాలను చూస్తుంటే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును దేశంలో తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

భారతీయ మార్కెట్లో రెనో జో విడుదలకు సంబంధించిన ప్రణాళికలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అయితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగుతున్నందున రెనో కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి ఓ పూర్తి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే గనుక నిజమైతే, వచ్చే ఏడాది నాటికి రెనో నుండి ఓ ఆల్-ఎలక్ట్రిక్ కారు భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త వెహికల్స్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఇక రెనో జో ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, కంపెనీ ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2012 జెనీవా మోటార్ షోలో పరిచయం చేసింది. ఆ తర్వాతి కాలంలో కంపెనీ ఇందులో ఓ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, ఇప్పటికే వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఇంటర్నేషల్ వెర్షన్ రెనో జో ఈవి రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో ఆర్110 మరియు ఆర్135 వేరియంట్లలో లభిస్తోంది. అయితే, ఈ రెండు మోడళ్లలో ఒకే రకమైన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కాంబినేషన్‌ ఉంటుంది. ఇది మూడు-దశల ఎలక్ట్రిక్ మోటారుతో 52 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో జో ఆర్110 వేరియంట్ గరిష్టంగా 107 బిహెచ్‌పి పవరే‌ను మరియు 225 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఆర్135 గరిష్టంగా 134 బిహెచ్‌పి పవరే‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఆర్110 వేరియంట్ కేవలం 11.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 135 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇకపోతే, ఆర్135 వేరియంట్ కేవలం 9.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 140 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో జో పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 395 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. స్టాండర్డ్ వాల్ సాకెట్ ఉపయోగించి చార్జ్ చేస్తే రెనో జో బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావటానికి 16 గంటల 10 నిమిషాల సమయం పడుతుంది. అదే ఏసి ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినట్లయితే 9 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో డిసి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది, దీని సాయంతో కేవలం 70 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో జో కారులో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో ఉంచిన పెద్ద రెనో లోగో, క్రోమ్ ఎంబెడెడ్ బంపర్స్ మరియు ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ ఉంటాయి. ఇంకా ఉందులో డైమండ్ ఆకారంలో ఉన్న ఎల్ఈడి టెయిల్ లాంప్స్, బూట్-లిడ్‌పై ‘జో' బ్యాడ్జింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ కూడా ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఇంటీరియర్స్‌లో రెనో జోలో 9.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో బోస్ నుండి గ్రహించిన ఆప్షనల్ ప్రీమియం ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

ఈ కారులోని ఇతర ఫీచర్లలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, బ్లాక్-అవుట్ సీట్ అప్‌హోలెస్ట్రీ, ఈబిడితో కూడిన ఏబిఎస్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో రెనో జో ఎలక్ట్రిక్ కార్; వచ్చే ఏడాదిలో విడుదల!

రెనో జో ఎలక్ట్రిక్ వాహనంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనో జో ఈ.వి బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 400 కిలోమీటర్లకు దగ్గరగా ఉన్న డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఇది సిటీ ప్రయాణాలకే కాకుండా చిన్నపాటి దూర ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రాక్టికాలిటీని పెంచే ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. భారత మార్కెట్లో జో ఈ.వి. లాంచ్ ప్లాన్స్‌ను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

Source: Car Crazy India

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
The Renault Zoe EV has been spotted testing yet again in the Indian market. The French auto manufacturer had showcased the Zoe EV at the 2020 Auto Expo and announced that it was assessing the market feasibility for the model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X