కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తోంది. రెనాల్ట్ కిగర్ అనే పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ప్రస్తుతం భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో విడుదల కావటానికి సిద్ధంగా ఉన్న కారు మరోసారి టెస్టింగ్ దశలో కెమరాకు చిక్కింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

తాజాగా విడుదలైన స్పై చిత్రాలను చూస్తుంటే రెనాల్ట్ తమ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ముంబై-పూణే హైవేపై టెస్టింగ్ చేస్తోంది. ఈ టెస్టింగ్ మోడల్‌ను ఏ మాత్రం వివరాలు తెలియకుండా ఉండేలా పూర్తిగా క్యామోఫ్లేజ్ చేశారు. ఈ చిత్రాల్లో కిగర్ ఎస్‌యూవీలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, రెనాల్ట్ బ్రాండ్ సిగ్నేచర్ గ్రిల్ డిజైన్ మరియు ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ వివరాలు కనిపిస్తాయి.

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

రెనాల్ట్ నుంచి రానున్న కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ కారుకి అంతర్గతంగా హెచ్‌బిసి (HBC) అని కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. 'కిగర్' అనేది ఈ ఎస్‌యూవీ యొక్క తుది పేరు కాకపోవచ్చు.

MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

ప్రస్తుతం ఈ బ్రాండ్ లైనప్ నుంచి తయారవుతున్న రెనాల్ట్ ట్రైబర్‌లో ఉపయోగిస్తున్న CMF-A+ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసే ఆస్కారం ఉంది. తాజాగా దొరికిన చిత్రాలు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క రియర్ డిజైన్‌ను కూడా వెల్లడి చేసేలా ఉన్నాయి, ఇది ఎత్తైన రైడింగ్ స్టాన్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా కిగర్‌లో మంచి క్యాబిన్ స్పేస్ ఉండనుంది, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్ సామర్థ్యాన్ని ఆఫర్ చేయనుంది.

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

రెనాల్ట్ కిగర్ పెద్ద వీల్ ఆర్చెస్‌ను కలిగి ఉండి, బోల్డ్‌గా కనిపించే క్రీజ్ లైన్స్ మరియు ఫ్లోటింగ్-రూఫ్ డిజైన్‌తో రగ్గడ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ కారు ఇంటీరియర్ లోపల కూడా అనేక ఫీచర్లు మరియు కనెక్టివిటీ సదుపాయాలు అలాగే కంఫర్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

MOST READ: ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండొచ్చని అంచనా. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటుగా బ్రాండ్ స్వంత కనెక్టింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్ కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

ఇంజన్ విషయానికి వస్తే.. రెనాల్ట్ ఇందులో రెండు 1.0-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. లోయర్-స్పెక్ వేరియంట్లలో న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్‌ను రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి నుంచి గ్రహించనున్నారు. ఈ ఇంజన్ 71bhp పవర్‌ని మరియు 96Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కిగర్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను చేర్చడం. ప్రస్తుతం 'హెచ్‌ఆర్10' (HR10) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా సుమారు 95 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ టర్బో-పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడే ఆస్కారం ఉంది.

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

రెనాల్ట్ కిగర్ భారత మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రీజ్జా మొదలైన మోడళ్లకు గట్టిగా నిలుస్తుంది. అయితే, రెనాల్ట్ అనుబంధ సంస్థ నిస్సాన్ తయారు చేస్తున్న మాగ్నైట్ అనే కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ రెనాల్ట్ కిగర్‌కు మరింత గట్టి పోటీనిచ్చే ఆస్కారం ఉంది.

MOST READ: రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

కెమరాకి చిక్కిన రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కిగర్, త్వరలో విడుదల!

రెనాల్ట్ కిగర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త రెనాల్ట్ కిగర్ అధునాతన ఫీచర్లతో పాటుగా టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని మేము అంచనా వేస్తున్నాము. ప్రస్తుతం అత్యధికంగా పాపులర్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనాల్ట్ కిగర్ బాగా స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Source:Rushlane

Most Read Articles

English summary
The Renault Kiger compact-SUV has been spotted again ahead of its launch in the Indian market. The French auto manufacturer is expected to launch the Kiger SUV sometime in the next year. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X